Slider నల్గొండ

తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కోనుగోలు చేయాలి

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కోనుగోలు చేయాలిప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ కట్టా గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో లక్కవరం గ్రామంలో 500 మెట్రిక్ టన్నుల కెపాసిటితో నూతన గోదాం నిర్మించేందుకు నిధులు మంజూరు కావడం,త్వరలోనే గోదాం నిర్మాణం చేయనుండటం రైతులకు శుభవార్త అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపకుండా పంజాబ్ తరహాలో పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించాలని అన్నారు.స్థానిక మిల్లర్లు కూడా ధాన్యాన్ని బస్తాల లెక్కన కాకుండా క్వింటాళ్ళ లో కొనుగోలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లు వల్లభనేని విజయలక్ష్మి,రణపంగు కాశమ్మ,డైరెక్టర్లు శీలం నరసింహారావు, కొనుగంటి కోటిరెడ్డి,గుండెపంగు బాబు, కుక్కడపు అంజమ్మ, సిఈవో జనార్ధన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బీహార్ లో బిజెపికి రానున్నది గడ్డు కాలమే

Satyam NEWS

G-7 సమ్మిట్: భారత్ కు ఆహ్వానం జర్మనీ పునరాలోచన?

Satyam NEWS

మేడా నిలయంలో వైయస్సార్సీపి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment