39.2 C
Hyderabad
May 4, 2024 22: 17 PM
Slider వరంగల్

ప్రభుత్వం రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటు

#bandisudhakargowd

వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తూ రైతాంగాన్ని అదోగతిపాలుచేస్తూన్న ప్రభుత్వ తీరు సిగ్గుచేటని టిపిసిసి కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. అవుటర్ రింగ్ రోడ్ కు ల్యాండ్ పూలింగ్ పేరుతో దాదాపు 2200 వేల ఎకరాల పచ్చని పంట పోలాలను సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

పచ్చని పంట పోలాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తూన్నా రైతాంగాన్ని రొడ్డున పడేస్తూన్నారని అవేదన వ్యక్తం చేశారు..ఇప్పటికే వరంగల్ నగరం అస్థిత్వాన్ని దెబ్బతీసి ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల కోసమే ల్యాంగ్ పూలింగ్ ను తెరపైకి తెచ్చిరని అరోపించారు. కుడా(KUDA) వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఇటివల మంత్రి కేటీఆర్ కూడ భూమిని సేకరించి వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తామని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని  అన్నారు.

తక్షణమే ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే నాలా కన్వర్షన్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ ను రద్దు చేయాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ మహనగరాన్ని వల్లకాడు చేయాలని చూస్తూన్న టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రయాత్నాలను వరంగల్ ప్రజలు ముక్తకంఠంతో ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల పట్ల ప్రభుత్వం కక్ష సాదింపు సాదిస్తూన్నట్లుగా కనపడుతుంది.

ప్రభుత్వం ఉంది ప్రజలకు మేలు చేయాలని, కాని వ్యాపారం చేయకుడదన్నా కనీస అవగాహన లేకపోవడం హస్యాస్పదంగా ఉంది. తక్షణమే బేషరతుగా ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఉపసంహరించి రైతాంగానికి న్యాయం చేయ్యలని డిమాండ్ చేశారు.

Related posts

దేశాన్ని అమ్మే పనిలో మోడీ ప్రభుత్వం

Bhavani

క‌రోనా వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్….!

Satyam NEWS

పి సి.సి ప్రతినిధిగా అల్లం ప్రభాకర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment