26.2 C
Hyderabad
May 19, 2024 20: 19 PM
Slider శ్రీకాకుళం

పాత్రునివలసలో ఘనంగా వేమన జయంతి ఉత్సవం

#Vemana Jayanti festival

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన వేమన జయంతి ఉత్సవం ఘనంగా జరిగినది. సంఘసంస్కర్తగా, ప్రజాకవిగా వేమన మంచి పేరు పొందారని ప్రధానోపాధ్యాయులు అన్నారు. పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు పిసిని వసంతరావు మాట్లాడుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడని, వానకు తడవని వారు ఒక్క వేమన పద్యము కూడా రాని తెలుగువారు ఉండరని అన్నారు.

వేమన పద్యాలు సిపి బ్రౌన్ ద్వారా పామరులకు కూడా అర్థమయ్యేలా ఆట వెలదిలో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు, ఎన్నో సామ్యములు తెచ్చి అందరికీ తన పద్యాల ద్వారా నీతిని ప్రబోధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ ,కరణం శ్రీహరి ,బలివాడ ప్రభాకర రావు, బుడుమూరు అప్పలనాయుడు,బెం డి శారద, రాష్ట్ర భాషో పాధ్యాయ సంస్థ జిల్లా

అధ్యక్షులు, మరియు ఫోర్ట్టో చైర్మన్ పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, పొన్నాన ఉషారాణి ,సంపతి రావు రమణమ్మ, కొణ పల శ్రీనివాసరావు, బొంగు వెంకటరమణమూర్తి, నక్కిన స్వప్న ,తంగి పద్మావతి, సి ఆర్ పి పంచి రెడ్డి మోహనరావు,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం సిటిసి ప్రిన్సిపల్ గా సుభాష్ చంద్రబోస్

Bhavani

సోనియా గాంధీ కార్యదర్శిపై రేప్ కేసు నమోదు

Satyam NEWS

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment