Slider ఆధ్యాత్మికం

ఉగాది నుండి శ్రీరామనవమి వరకు విజయనగరంలో శ్రీదండుమారమ్మ ఉత్సవాలు

#spdeepika

అట్ట హాసంగా ఉత్సవాలను ప్రారంభించిన ఎస్పీ దీపిక దంపతులు

విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 9 నుండి 16 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ వేడుకల్లో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా పాటిల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు.

ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, విక్రాంత్ పాటిల్ దంపతులకు వేద పండితులు మంత్రోచ్ఛరణలతోను, పూర్ణ కుంభంతోను స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి పసుపు కుంకుమలు, వస్త్రాలు సమర్పించారు.

శ్రీ దేవీ దండుమారమ్మ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున ఆలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ దంపతులతో వినాయక పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, కలశ స్థాపన, సహస్ర కుంకుమార్చన, చండీపారాయణ, విశేష హెూమంలు, నీరాజన మంత్ర పుష్పములును వేద పండితులు నిర్వహించారు. అనంతరం, అమ్మవారి తీర్ధ ప్రసాదాలను ఎస్పీ దంపతులు స్వీకరించి, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది మరియు దండుమారమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ దేవీ దండుమారమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న సామూహిక సహస్రనామ కుంకుమార్చన ఉదయం 9 గంటల నుండి దేవాలయ ప్రాంగణమందు జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ నెల 16న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని సాయంత్రం 5.30 గం॥ లకు డప్పులు, చిత్ర, విచిత్ర వేషాలతోను, కోలాటాలు, ప్రత్యేక కాళికా వేషంలోను, సాంస్కృతిక కార్యక్రమాలతోనూ ఊరేగింపు నిర్వహించనున్నట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు.

అదే విధంగా ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈ నెల 9న రాత్రి ‘భరత నాట్యం’ 10న ‘డాన్స్ బేబీ డాన్స్’ 11న ‘రేలా రేరేలా’ 12న ‘సీతారామకళ్యాణ బుర్రకథ’ 13న ‘డాన్స్ బేబీ డాన్స్’ 14న ‘బాల నాగమ్మ బుర్రకథ’ ఉంటుందన్నారు. ఈ నెల 15న ‘శ్రీ దేవీ దండుమారమ్మ పురాణం’ సిరిపురపు పోతినాయుడు (రిటైర్డ్ ఉపాధ్యాయులు) చే చెప్పబడుతుందన్నారు. ఈ నెల 20న ఆలయ ప్రాంగణం నందు అన్న సమారాధన నిర్వహించనున్నట్లుగా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, పార్వతీపురం ఏఆర్ డీఎస్పీ అప్పారావు, విజయనగరం డీఎస్పీఆర్.గోవిందరావు, ఆర్ఐలు ఎన్. గోపాలనాయుడు, రమేష్, శ్రీరాములు, శ్రీనివాసరావు,సీఐ లు డా. వెంకటరావు, శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు తాతరాజు, రవీశ్వరుడు, వాసు, శివ, లక్ష్మణ్, వాసు, శ్రీనివాసరావు, బోనంగి నాయుడు, బంగారి నాయుడు, బలరాం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున మెగా రక్తదాన శిబిరం

Satyam NEWS

వైఎస్ఆర్ టిపి జి హెచ్ ఎం సి కో-ఆర్డినేటర్ రాజగోపాల్ కు సన్మానం

Satyam NEWS

నవంబర్ 3న పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment