Slider హైదరాబాద్

భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దాం

#aisf

మోడీ చేస్తున్న భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దామని, దేశ సమర్ధత, ఆర్ధిక విధానాలను నాశనం చేయడమే బీజేపీ అజెండా అని సాంస్కృతిక, సామాజిక విశ్లేషకురాలు దేవి అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కన్వెన్షన్ లో భాగంగా మొదటి రోజు జరిగిన సదస్సులో “భావోద్వేగ మత రాజకీయాలు” అనే అంశంపై ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు, సాంస్కృతిక ప్రముఖులు దేవి ప్రధాన వక్తగా హాజరై, ప్రసంగించారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కన్వెన్షన్ కు స్వాగత ఉపన్యాసం చేయగా, రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు, సాంస్కృతిక ప్రముఖులు దేవి  మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ, దేశ హోంమంత్రి అమిత్ షా లతో అంబానీ, అదానీ లు మేమిద్దరం, మాకు ఇద్దరు అంటూ దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని, ఈ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, మతోన్మాద బీజేపీ ని ఓడించాలని వారు పిలుపునిచ్చారు.

అంబానీ అదానీల విధానాలను అమలు చేస్తున్న మోడీ

దేశ పరిపాలనను మోడీ అంబానీ, అదానీ ల విధానాలనే అనుసరిస్తున్నాడని వారు ధ్వజమెత్తారు.56 ఇంచుల ఛాతీ తో దేశాన్ని రక్షిస్తున్నానని,అభివృద్ధి చేస్తున్నానని మోడీ ప్రగల్బాలు పలుకుతున్నారని, మోడీ నిజంగా దేశాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పటికే దేశంలో అర్ధాకలితో ప్రజలు ఎందుకు అలమటిస్తున్నారో మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హిందూత్వానికి యజమానులు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కాదని… దేశ ప్రజలే యజమానులని ఉద్ఘాటించారు. మోడీ చర్యలన్ని పురుషాధిక్యతకు అద్దం పడుతాయని, అందుకే అయోధ్యలో కేవలం సీతా దేవి లేని రాముడు విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారని విమర్శించారు.

భౌతిక వాదులైన కమ్యూనిస్టు లు నిరంతరం ప్రజలకు అవసరమైన విధానాలపై పోరాటాలు చేస్తారని, అటువంటి భౌతిక వాదులపై దేశ వ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ దాడులు చేయడాన్ని దేశ ప్రజాస్వామిక వాదులంతా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అయోధ్య లో రామ మందిర అంశం ద్వారా మరో మారు గెలవాలనే మోదీ పన్నాగాలు, ఓట్లు వస్తాయనే ఆశలు కనుమరుగయ్యాయని అందుకే ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులపై ఈడీ, సీబీఐ ద్వారా అరెస్ట్ లు చేసి గెలవాలనే నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని వారు ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన10సంవత్సరాల కాలంలోనే హిందువులు ప్రమాదంలో పడ్డారని వారు అన్నారు. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా భౌతిక వాదులు, జర్నలిస్టులు, ప్రశ్నించే గొంతుకులపై అధికారాన్ని, అణచివేతను  ప్రయోగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యం పై దాడులుగా అభివర్ణించాలన్నారు.దేశంలో అవినీతిని అంతం చేస్తానని చెబుతున్న మోడీ, ప్రస్తుతం మోడీ పాల్గొంటున్న అన్ని ప్రచార సభల్లో వేదికలపై పాల్గొంటున్న మెజారిటీ నేతలంతా అవినీతిపరులు కాదా,వారంతా బీజేపీ నేతలేగా అని వారు ప్రశ్నించారు.

మనుషుల మధ్య దూరం పెంచుతున్న మోడీ

మోడీ చేస్తున్న ఉదారవాద రాజకీయాల కారణంగా మనుషుల మధ్య దూరం ఏర్పడిందని, ప్రశ్నించే తత్వాన్ని పౌరులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుష్టులు చెప్పే అంశాలే నిజమనే భావనలో ఉంటున్నారని, పోరాటాల దిశగా ఆలోచనలు చేయడం లేదని వారు అన్నారు. అదే విధంగా మోడీ గతాన్ని కీర్తించడం, భవిష్యత్ ను గొప్పగా అభివర్ణిస్తున్నారని, మరి వర్తమానం గురించి ఎందుకు చెప్పడం లేదో దేశ ప్రజలు గమనించాలని, కేవలం అబద్ధాలను ప్రచారం చేయడమే మోడీ భజన పరుల నినాదమని వారు విమర్శించారు.

పెరిగిపోతున్న నిరుద్యోగం

దేశ వ్యాప్తంగా 45శాతం గ్రాడ్యుయేట్ లు నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. ఎలెక్టోరల్ బాండ్లు అవినీతి బాండ్లని, దాదా వసూళ్ల బాండ్లని వారు అన్నారు.మోడీ 10 సంవత్సరాల కాలంలో తన బ్రాండ్ ఇమేజ్ కోసం కొన్ని కోట్లకు పైగా ఖర్చు చేశారని ,ఇవి దేశ ప్రజల డబ్బు అని వారు అన్నారు. అందుకే దేశంలో ప్రస్తుతం భావోద్వేగ పూరిత మత రాజకీయాలు నడుస్తున్నాయని, దీనిని పౌరులంతా తిప్పి కొట్టాలని మతతత్వ రాజకీయాలకు దేశంలో చోటు లేదని ,సర్వ మత సమ్మేళనమే భారతదేశమని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్య ప్రసాద్, యుగంధర్, శ్రీమాన్…రాష్ట్ర సమితి సభ్యులు స్వప్న,పోలోజు లక్ష్మణ్, షేక్ మహమూద్,మొగిలి లక్ష్మణ్, ఎల్లంకి మహేష్, చిలకరాజు శ్రీను, మార్కపూరి సూర్య, మానస్ కుమార్,నాయీమ్, చిరంజీవి, రాజేష్, మజీద్,అనిల్, కళ్యాణ్, సుశాంత్, వెంకన్న, శోభన్, రమేష్, తాళ్లపల్లి సురేందర్, శేఖర్, రాధ, రవి కుమార్, కిషన్, ఆంజనేయులు లతో పాటు 70మంది జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వరిపంట చేతికి వచ్చే దశలో రైతాంగం మరింత జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన జర్నలిస్టులు

Satyam NEWS

మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment