38.2 C
Hyderabad
May 3, 2024 22: 41 PM
Slider చిత్తూరు

“గంగమ్మ జాతర వాయిదా” సాంప్రదాయ విరుద్ధం…

#naveenkumarreddy

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో  ఎవరి ఆదేశాల మేరకు  వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని, ఆనవాయితీ ప్రకారం అవిలాల చాటింపుతో తిరుపతి జాతర ప్రారంభమవుతుందని, తరతరాలుగా జరుగుతున్న గంగమ్మ జాతర సాంప్రదాయానికి మంగళం పాడేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మహా అపచారం అన్నారు.

ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో సైతం ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను గంగమ్మ జాతరను ఏకాంతంగా నిర్వహించారన్న విషయాన్ని అధికారులు గుర్తించి సాంప్రదాయం ప్రకారం ఎన్నికలతో సంబంధం లేకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు నడుమ యధావిధిగా తిరుపతి ప్రజల గ్రామదేవత, పిలిస్తే పలికే తల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను నిర్వహించాలన్నారు. ప్రపంచ యుద్ధాలు,ప్రకృతి వైపరిత్యాలు వస్తే వాయిదా అనివార్యం అనిపిస్తే సాంప్రదాయ పండుగలను, ఏకాంతంగా కైంకర్యాలను జరిపించి ప్రాయశ్చిత్తము చేసి వేరే రోజులలో ఉత్సవాలు చేసుకునే అవకాశం ఉందనీ మరి అలాంటి పరిస్థితులు తిరుపతిలో లేవని ఎన్నికలకు గంగమ్మ జాతరకు ముడిపెట్టి వాయిదా వేసే అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉగాది శ్రీరామ నవమి రంజాన్ లాంటి అనేక పండుగలు ఊరు వాడ నిర్వహించారని, భద్రాచలంతో పాటు ప్రతి శ్రీరాముని దేవాలయంలో ఎంతో వైభవంగా కల్యాణాలు జరిగాయన్నారు. ఏపీలో రాబోవు రోజులలో వినాయక చవితి,దసరా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఇలానే వాయిదా వేస్తారేమో అన్న అనుమానాలు హిందూ భక్తులలో కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాధికారులను, అధికారి పార్టీ నాయకులను నవీన్ హెచ్చరించారు.

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ,పోలీస్, నగరపాలక సంస్థ, తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసే తిరుపతి విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారులతో,మట్టిని తీసుకువచ్చే కుమ్మరి వాళ్లతో, వేదికను తయారు చేసే వడ్రంగితో సహా అవిలాల లోని గ్రామ పెద్దలు కైకాల వంశస్తులతో తిరుపతి లోని స్థానిక భక్తులతో వెంటనే జిల్లా కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల ఆలోచనలను,సూచనలను పరిగణలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో జాతర నిర్ణయం తీసుకొని ప్రకటించాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ కి,జిల్లా కలెక్టర్ కి నవీన్ విజ్ఞప్తి చేశారు.

Related posts

నన్ను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది

Satyam NEWS

నియంత పాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Satyam NEWS

పాలకుర్తి కేంద్రంగా దేవాలయాలతో టూరిజం హబ్ అభివృద్ధి

Bhavani

Leave a Comment