28.7 C
Hyderabad
May 6, 2024 07: 35 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

#nagarkurnoolsp

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 18న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నాగర్ కర్నూల్ లలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. ఈ  కార్యక్రమాల నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కె మనోహర్, అదనపు కలెక్టర్ మోతిలాల్ బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలో పర్యటించారు. పోలీస్‌ బందోబస్తు, హెలిప్యాడ్ స్థలం, కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ నాగర్ కర్నూలు పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

మంజూరైన అభివృద్ధి పనులు

మంత్రి ప్రధానంగా  నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ పథకాల ద్వారా మంజూరైన కొల్లాపూర్ చౌరస్తా సైడ్ లైటింగ్ ప్రారంభోత్సవం – రూ. కోటి 20 లక్షలు, ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం రూ.17కోట్లు, ట్యాంక్ బండ్ పై జెండా ఆవిష్కరణ – రూ. 25 లక్షలు, రైతు బజార్ వద్ద యూజీడీ ప్రారంభోత్సవం (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) రూ. 90 కోట్లు, అంబేద్కర్ చౌరస్తా వద్ద సీసీ రోడ్స్ ప్రారంభోత్సవం, శంకుస్థాపన రూ. 28 కోట్లు, కలెక్టరేట్ వద్ద మిషన్ భగీరథ ప్రారంభోత్సవం రూ.35 కోట్లు, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన రూ.4.50 కోట్లు, పాత మార్కెట్ యార్డు వద్ద వైకుంఠదామం, డంపింగ్ యార్డు శంకుస్థాపన రూ. 2కోటీ, మున్సిపల్ ఆఫీస్ ప్రారంభోత్సవం రూ. 1.20కోట్లు, జడ్చర్ల టూ నాగర్ కర్నూల్ వయా సిర్సవాడ ఆర్.అండ్.బీ రోడ్డు ప్రారంభోత్సవం, – రూ.60 కోట్లు, మార్కెండయ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన రూ. 90 కోట్లు, జిల్లా గ్రంథాలయ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన – రూ.2 కోట్లు,  పాత మార్కెట్ యార్డు వద్ద టౌన్ హాల్ నిర్మాణ పనుల శంకుస్థాపన రూ., పాత మార్కెట్ యార్డు వద్ద వెజేటేబుల్ మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన 7 కోట్లు, ఆర్.అండ్. బీ గెస్టుహౌజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన రూ.6 కోట్లు, ప్రారంభోత్సవాల పనుల విలువ రూ. 238.15 కోట్లు శంకుస్థాపనల పనుల విలువ రూ. 110 కోట్లు ఆర్.అండ్.బీ పనుల విలువ రూ. 44.25 కోట్లు

ఆర్.అండ్.బీ ద్వారా మంజూరైన పనులు

నాగర్ కర్నూల్ – జడ్చర్ల రోడ్డు 40/4 టూ 42/100 (బ్రిడ్జీ) రూ. 2 కోట్లు, బ్రిడ్జీ టూ వనపర్తి – జడ్చర్ల రోడ్డు 30/0-2 టూ 30/2-4 రూ. 3 కోట్లు, బ్రిడ్జీ టూ మహబూబ్నగర్ రోడ్డు 38/2-4 రూ. 1 కోటీ వనపర్తి – జడ్చర్ల రోడ్డు 18 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వరకు (అప్రోచ్ రోడ్డు) రూ. 18.50 కోట్లు 5. బ్రీడ్జీ టూ లింగసానిపల్లి నుంచి తాడూరు వరకు 15/4-6 రూ.2.42 కోట్లు, బ్రీడ్జీ టూ లింగసానిపల్లి నుంచి తాడూరు వరకు 17/6-8 రూ. 2.40 కోట్లు కోట్లు, బ్రిడ్జీ టూ మల్కాపూర్ నుంచి తెలకపల్లి రోడ్డు వరకు 11/8-12/2 రూ.4.28 కోట్లు, ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణం రూ.3.20 కోట్లు, హెచ్. ఎల్. బీ 48/6-8 మహబూబ్ నగర్ టూ మంగనూర్ రోడ్డు రూ.7.50 అదేవిధంగా మంత్రి ఉదయం ముందుగా కొల్లాపూర్ పట్టణంలో 10 కోట్ల 30 లక్షలతో సిసి రోడ్లు ప్రారంభం, 147 కోట్లతో సింగోటం జలాశయం నుంచి గోపాల్ దిన్నె జలాశయం వరకు లింక్ కెనాల్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

పెంట్లవెల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. మంత్రిపర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని  ఎస్పి కె మనోహర్ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. రూట్‌ బందోబస్తు, కాన్వాయ్‌, హెలీప్యాడ్‌ బందోబస్తు, బహిరంగ సభ బందోబస్తు, ఏర్పాట్లపై  అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నాగలక్ష్మి, ఆర్ అండ్ బి డిఈ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణకు అమిత్‌ షా… ఖరారైన షెడ్యూల్‌

Bhavani

40వేల కుటుంబాలను ఆదుకున్న కోమటిరెడ్డి

Satyam NEWS

అవినాష్ రెడ్డి  అరెస్టుకు తొలగిన అడ్డంకులు

Satyam NEWS

Leave a Comment