40.2 C
Hyderabad
May 2, 2024 15: 33 PM
Slider చిత్తూరు

పెద్దిరెడ్డి.. తాగి వచ్చి నా కాళ్లు పట్టుకున్నావ్‌..!

#peddireddyramachandrareddy

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ పర్యావరణశాఖ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరువు తీసేశారు. ప్రస్తుతం రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గరువారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు దీటైన కౌంటర్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి పదే పదే విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. పెద్దిరెడ్డి అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి  తన కాళ్లు పట్టుకున్న విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి బహిర్గతం చేశారు. ఇలా చెప్పడం సంస్కారం కాదని.. అయినా ఆ విషయం బహిర్గతం చేసేలా పెద్దిరెడ్డే తనను రెచ్చగొట్టాడని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

‘‘ఈ విషయం నేను చెప్పకూడదనుకున్నాను. కానీ చెప్పాల్సి వస్తోంది. డీసీసీ ఎన్నికల సమయంలో ఓసారి నేను నా నియోజకవర్గానికి చెందిన 50 మంది నేతలతో పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నాం. రాత్రి 11 గంటల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్లు పట్టుకొని తనను డీసీసీ ప్రెసిడెంట్ చేయమని అడిగారు. మీరు పెద్దవారు నా కాళ్లు పట్టుకుంటారేంటి.. ఇది మంచిది  కాదన్నా లేవండి.. అన్నాను. నీ సపోర్ట్ ఉంటే నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతా అన్నాడు. ఉదయాన్నే మళ్లీ 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్లు పట్టుకుంటా అనుకుంటావేమో.. నిజంగానే కాళ్లు పట్టుకుంటున్నా అని మళ్లీ పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు. నేను కాణిపాకంలో కూడా ప్రమాణం చేసి చెప్పడానికి రెడీగా ఉన్నాను. నువ్వొస్తావా ఛాలెంజ్ కి. మాకు కాళ్లు పట్టుకొనే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్ నాథ్ రెడ్డి కొడుకును. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, మా ఆత్మగౌరవాన్ని ఏనాడూ తాకట్టు పెట్టము’’ అని కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.

ఈ ఘటనను ఇంతకాలం బహిర్గతం చేయకుండా ఉండడానికి తనకు సంస్కారం అడ్డువచ్చిందని.. అందుకే ఇంతకాలం ఓపిక పట్టానని అన్నారు. అధికార మదంతో పెద్దిరెడ్డి పదేపదే తనపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు బహిర్గతం చేశానని అన్నారు. ఎవరి నైజం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు ఇష్టం లేకపోయినా చెబుతున్నానని చెప్పారు. పెద్దిరెడ్డిని మంత్రిగా ఉండగానే తట్టుకోలేకపోతున్నామని.. ఆయన్ను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.

Related posts

అధికారులకు ప్రాణ సంకటంగా మారిన ప్రభుత్వ తప్పిదాలు

Murali Krishna

జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

విద్వేషాలను రగిల్చే చిత్రం ‘ది కేరళ స్టోరీ’

Satyam NEWS

Leave a Comment