28.7 C
Hyderabad
April 28, 2024 08: 05 AM
Slider నల్గొండ

ఎస్ టి యు 2024 డైరీ ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మంగళవారం ఎస్టియు 2024 సంవత్సరం నూతన డైరీ,జీవో బుక్,జిల్లా క్యాలెండర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టియు జిల్లా అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు,బంధం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్య లైన బదిలీలు, ప్రమోషన్లు తక్షణమే చేపట్టాలని,అన్ని పాఠశాలల్లో స్కావెంజర్ పోస్టులు నింపాలని,ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు ఇవ్వాలని,ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఎఫ్ ఎల్ ఎన్, ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని కోరారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, తప్పకుండా ఉపాధ్యాయులు అందరితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష్య,కార్యదర్శులు జిల్లా నాయకులు బి.రామచంద్ర రెడ్డి,బూర వెంకటేశ్వర్లు, సురగాని లింగయ్య,రామిశెట్టి శ్రీనివాస్, రామనరసయ్య,అత్తి వెంకటేశ్వర్లు,గోవింద నాయక్,కె.వి.ఎన్ మూర్తి,వీరేంద్ర వర్మ,ఎస్ బిక్షం,ఎం.పాపారావు,డి.శ్రీనివాస్,నేలపట్ల సత్యనారాయణ,గుండు ఆదినారాయణ, వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఘోరం: మూడోతరగతి బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS

ఇది నిజంగా విక్రమ్‌ లాండరేనా

Satyam NEWS

వనపర్తి డిపిఆర్ఓగా పి. సీతారాం నాయక్ కు పదోన్నతి

Satyam NEWS

Leave a Comment