29.7 C
Hyderabad
May 1, 2024 10: 19 AM
Slider ప్రపంచం

జపాన్‌లో భారీ భూకంపం: ప్రాణ నష్టం లేదు

#earthquake

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్‌లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4తీవ్రతతో భూకంపం వచ్చినట్టు ఆ దేశ వాతావరణం సంస్థ తెలిపింది. జపనీస్ దీవులైన క్యుషు, షికోకులను వేరుచేసే జలసంధి బుంగో ఛానల్ కేంద్రంగా భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలే దని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సునామీ హెచ్చరికలు సైతం అధికారులు జారీ చేయ లేదు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంద ని తెలుస్తోంది. ఎహైమ్‌లో ఎలక్ట్రిక్ పవర్‌కు సంబం ధించిన ఇకాటా అణు కర్మాగారం, ఒక రియాక్టర్ పని చేస్తుండగా..దానికి ఎటువంటి నష్టం జరగలే దని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Related posts

అన్నమాచార్య గ్రూప్ కరోనా విరాళం రూ.5 లక్షలు

Satyam NEWS

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

Bhavani

భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పించని మునిసిపల్ అధికారులు

Satyam NEWS

Leave a Comment