31.2 C
Hyderabad
May 20, 2024 12: 40 PM
Slider జాతీయం

షిర్డీ సహా అన్ని గ్రామాలలో కొనసాగుతున్న బంద్

shirdi_sai_baba-shamadhi-1

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధావ్ థాక్రే షిర్డీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీ సహా పలు గ్రామాల్లో ఉదయం నుండి బంద్ కొనసాగుతున్నది. సాయిబాబా పుట్టింది షిర్డీలో కాదని చెబుతూ మహారాష్ట్ర లోని పర్బనీ జిల్లా పాథ్రీ సాయి జన్మస్థానమని కూడా ముఖ్యమంత్రి ఉద్ధావ్ థాక్రే చెప్పారు. అంతే కాకుండా పాథ్రీ అభివృద్ధి కోసం ఆయన రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాయి కర్మభూమిగా భావించే శిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి.

పాథ్రీ అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని తమ బాధ అంతా సాయి జన్మభూమిగా ప్రచారం చేయటమేనని శిరిడీ వాసులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ శిరిడీలో ఆదివారం నుంచి సమ్మె చేపట్టాలని స్థానికులు నిర్ణయించి నిరసనలు మొదలు పెట్టారు. ఈ కారణంగా అన్ని గ్రామాలలో బంద్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రేపు షిరిడి సంస్థాన్ ట్రస్ట్ తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. మహారాష్ట్ర సీఎం ట్రస్ట్ సభ్యులను చర్చలకు పిలిచారు.

Related posts

శ్రీకారం చుట్టుకున్న రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్

Satyam NEWS

తప్పుల తడకగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Bhavani

సెల్ఫ్ పోలీసింగ్

Satyam NEWS

Leave a Comment