29.7 C
Hyderabad
May 2, 2024 05: 56 AM
Slider కవి ప్రపంచం

సెల్ఫ్ పోలీసింగ్

#Kondapally Niharini

సుడిగుండాలలో తలదూర్చడం,

సునామీలు కోరితెచ్చుకవడం,

మాటల భూకంపాలు సృష్టించడం,

చేతల ప్రళయ బీభత్సాలు పుట్టించడం,

మనిషొక అంతుబట్టని వింతజీవి!!

ఇసుకరేణువునూ వదలడు,

గడ్డిపోచనీ వదలడు!!!

ఈ కల్పిత మాయాజాల , మహేంద్రజాల మర్మాలు చూడ ,

ఎవరిదాష్టీకాలకోదోస్త్ ,జనులంతాబలి!

ఏవైనా తినొచ్చనే వాళ్ళ మతిలేనిచర్య

ముప్పుల కుప్పైకూర్చున్నది ‘కరోనా’ గా!

గబ్బిలాలు స్వేచ్ఛగా పుడితే ప్రకృతిస్థితి .

గబ్బిలాల్నితోటలాపెంచితే అసహజస్థితి

తలక్రిందువేళ్ళాటల సొల్లుతెచ్చిందో ఈపెంట,

తలమాసినపనులుతెచ్చెనో ఈ వైరస్ తంటా,

జీవరసాయన క్రిమిసృష్టి తెచ్చెనో ఈ మంట!

నిందలకు చిక్కని శత్రువిది!

సమరభేరీలనూ, సంయమనభేరీలనూ

అలవోకగ గెలిచామానాడు .

అంతుబట్టని ఆపద యుద్ధమీనాడు.

గెలుపు గురుతులు గుండెగోడలచేర,

ఒంటరి రాయిలా నవ్వడమూ నేర్వు!

కోట, బురుజుల నీ మనస్సునిప్పుడు

షీష్ మహల్ చేసి, దుఃఖ వర్ణాలద్దకు!

ఎట్లొచ్చెనోనని విదేశీయతనడగకు .

ఏ సాఫ్ట్ కార్నర్ లేనట్టు మాటలబాణాల వేయకు .

సాఫ్ట్ వేర్ ఉద్యోగ సద్యోగమే నీ స్టోరీలో!

క్షణాలతో సవాల్ చేస్తూ , కబుర్లపై సవారీ చేస్తూ,

సెల్లు సెల్లులుగా ఆన్ లైన్ నవ్వువీ , ఏడుపువీ నువ్వే అయ్యి ,

బొమ్మలపెట్టె ముందు బొమ్మవూ నీవే అయిన సాంకేతికత భాగ్యమంతా నీకెట్లొచ్చిందట? ఇకచెయ్యాల్సిందేంటి?

నీకు నీవే కవచమై,                            

నీ మేధస్సు కత్తికి నీవే ఒరవై,

ఒరిపిడివై, ఓపికవై..

ఒక్కడివే ఒంటరి సైన్యానివై …

అక్కడ ఇక్కడ అంతటనీవై తిరుగక,

గుంపుల గంపెడు ‘ఖర్చువు’ గాక,

నీదైన తెలివికి నీవే జోడు గుర్రానివిగా !

శుద్ధివై, శుభ్రతవై, శ్రద్ధ వై ,

నీ నమ్మకాల శక్తి యుక్తివై,

గుండె గడప దాటక..

అవసరమంటూ నీఇంటిగడపనూ దాటక,

మెర్సీలెస్ ‘కరోనా’ పై సెల్ఫ్ పోలీసింగ్ చేయి!

నీ శరీరమనే దేహదేశ సరిహద్దులోనికి

వైరస్ అనే శత్రువు జొరబడకుండా

జాగ్రత్తవు నువుగా…

సుడిగుండాలొద్దు , సునామీలొద్దు!

సెల్ఫ్ పోలీసింగ్ ముద్దు!                 

సెల్ఫ్ పోలీసింగ్ఈజ్ సోషల్ పోలీసింగ్

కొండపల్లి నీహారిణి

Related posts

సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల

Satyam NEWS

మూడు ఛానెళ్లపై నిప్పులు చెరగిన కొడాలి నాని

Satyam NEWS

టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం

Satyam NEWS

Leave a Comment