25.7 C
Hyderabad
May 20, 2024 03: 19 AM
Slider రంగారెడ్డి

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు బి ఎం ఏస్ నిరసన

#bms

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బి ఎం ఎస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లో 17న లక్షమంది కార్మికులతో నిర్వహిస్తున్న, భారీ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఈ సి ఐ ఎల్ కంపెనీ మెయిన్ గేట్  ఈ సి ఐ ఎల్ బి ఎం ఏస్ అధ్యక్షుడు ఏస్ హానుమంతు అధ్వర్యంలో  నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత దేశ అభివృద్ధిలో ప్రభుత్వ రంగసంస్థల పాత్ర గణనీయమైనది.కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం,ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఆధాని,అంబానీలకు కట్టబెట్టే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు.ప్రభుత్వ రంగసంస్థల జోలికి వేస్తే కేంద్ర  ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ఇప్పటికైన కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విశయం పై పునరాలోచించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈసిఐఎల్ బిఎంఏస్ నాయకులు సి.సుధీర్,కేశవ్, మురళి,కమలాకర్,లక్ష్మి కాంత్,నారాయణ, ప్రదీప్ కుమార్,వీరు నాయక్, రమేష్, శ్రీను, ఎన్ డి ఎఫ్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వాట్సాప్ ద్వారా ఐఐటీ-జేఈఈ ఫోరం గ్రాండ్ టెస్ట్స్ కీ

Satyam NEWS

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

అగ్నిపథ్ పథకంలో ఉన్న అసలు విషయం ఇది…

Satyam NEWS

Leave a Comment