25.7 C
Hyderabad
May 19, 2024 09: 43 AM
Slider నల్గొండ

చర్చలు సఫలం: పెరిగిన రైస్ మిల్ దిన కూలి రేట్లు

#Huzurnagar Rice Mill Association building in Suryapet district

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైస్ మిల్లు అసోసియేషన్ భవనంలో సోమవారం పొద్దుబోయేంత వరకు జరిగిన చర్చలో మూడు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం అయినయని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తెలిపారు. పెరిగిన రేట్లు గతంలో రోజు కూలి 420 రూపాయలు ఉండగా పెంచిన దిన కూలీ 500 రూపాయలు ఇచ్చుటకు రైస్ మిల్లర్స్ అంగీకరించారని,వీటితో పాటుగా బోనస్,ఆదివారం అదనంగా ఇతర అలవెన్స్ తో పాటు న్సూరెన్స్(ప్రమాద భీమా)సౌకర్యం కల్పిస్తామని రైస్ మిల్లర్స్ హామీ ఇచ్చినట్లు శీతల రోషపతి తెలిపారు.

పెరిగిన రేట్లు జనవరి 2023 నుండి 2024వ,సంవత్సరం డిసెంబర్ 31 వరకు రెండు సంవత్సరాలు అమలులో ఉంటాయని అంగీకరించినట్లు,రైస్ మిల్లు డ్రైవర్లకు వర్తించేటువంటి సెలవులన్ని రైస్ మిల్ కూలీలకు కూడా వర్తిస్తాయని శీతల రోషపతి తెలిపారు. ఈ చర్చల్లో రైస్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు,గజ్జి ప్రభాకర్ రావు,గెల్లి అప్పారావు,దొంగరి వెంకటేశ్వర్లు, యూనియన్ ప్రతినిధులు శీతల రోశపతి సాముల కోటమ్మ,షేక్ మున్ని,వీరమ్మ, బుజ్జి,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS

చైనాలో ప్రమాదకరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

రేపు కామారెడ్డిలో మంత్రుల పర్యటన

Satyam NEWS

Leave a Comment