28.7 C
Hyderabad
May 5, 2024 10: 10 AM
Slider పశ్చిమగోదావరి

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేయాలి

#Eluru District

ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి లు.ఏ ఎన్ ఎం లు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైడీ సేవాలందించాలని చెప్పారు. పెదవేగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో మంగళవారం
మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎం ఎల్ హెచ్ పి లతో.ఏ ఎన్ ఎం ల తో ప్రజారోగ్య పరిరక్షణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎం పి డి ఓ మాట్లాడుతూ ఆయా గ్రామాలలో విధులు నిర్వహించే ఎం ఎల్ హెచ్ పి లు ఏ ఎన్ ఎం లు ప్రతి రోజూ తప్పనిసరిగా గ్రామాలలో ఫీవర్ సర్వే చేయాలని సూచించారు.

విదినిర్వణలో భాగంగా విధులకు రాగానే ముందుగా అటెండెన్స్ వేయాలన్నారు. విధులు పరంగా మెయిన్ టైన్ చేసే రికార్డ్ లు ఎప్పటికప్పుడు అప్డేటేడ్ గా ఉంచాలన్నారు.వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందు మీరు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు తగిన సూచనలు సలహాలు అందించాలని చెప్పారు.ఎస్ డి జి సర్వే లో వేగం పెంచాలని అన్నారు. గర్భవతులు సకాలం లో టీకాలు అందించాలన్నారు.శిశుమరణాలు జరగకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.ప్ర భుత్వ ఆస్పత్రుల్లోనే పురుళ్లు పోసుకునేలా గర్భిణీ లను ప్రోత్సహించాలన్నారు. పాఠశాలను అంగన్వాడీ కేంద్రాలను ఎం ఎల్ హెచ్ పి లు.ఏ ఎన్ ఎం లో విజిట్ లు చేసి రక్త హీనత, నులిపురుగు వంటి లక్షణాలను గుర్తించి వాటి నివారణకు కావలసిన మాత్రలు పంపిణీ చేయాలని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ వైద్య సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమం లో పెదవేగి పి హెచ్ సి డాక్టర్ లు .సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిలిచిపోయిన పోలింగు తక్షణమే పునరుద్ధరిస్తారా?

Satyam NEWS

బీ టెక్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించాలి

Satyam NEWS

పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో పకడ్బందిగా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment