28.7 C
Hyderabad
April 26, 2024 10: 15 AM
Slider ప్రకాశం

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

#prakasham dist sp

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసు సిబ్బంది ప్రజలకు సేవ చేయాలంటే ముందు సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో పోలీస్ సిబ్బంది కోవిడ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆమె వివరించారు.

విధినిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆమె హెచ్చరించారు. కోవిడ్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.

సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని తెలియచేశారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసు అధికారులు సిబ్బంది వారి కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పని సరిగా పాటించాలని, జిల్లాలో కరోనా నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు వినియోగించుకుని, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

CCTNS ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యే కేసులను ఎఫ్ఐఆర్ నమోదు దగ్గరనుండి ఫైనల్ చార్జిషీట్ నమోదు అయ్యేంతవరకు CCTNS (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం) లో ప్రతి ఒక రికార్డు ను అప్లోడ్ చేయాలని సూచించారు.

మహిళా పోలీసులను నేర స్థలమునకు  తీసుకొని వెళ్ళి, నేర స్థలం సాక్ష్యాధారాలను చెదిరిపోకుండా తీసుకోవాలని జాగ్రత్తల గురించి అదేవిధంగా తీవ్రమైన కేసుల్లో గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి అధికారులు వారికి వివరించాలని తెలియచేశారు.

పోలీస్ వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల ఉనికి పై అవగాహన కలిగి ఉండాలని, మిస్సింగ్ కేసులు వివరాలు తెలుసుకొని వారి సమాచారం సంబంధిత అధికారులకు విధిగా అందచేయాలని సూచించారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో భారీ నిరసన ప్రదర్శన

Satyam NEWS

ఎటాక్:బీజేపీ నాయకుడి ఇంటి ఫై అర్ధరాత్రి దాడి

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పై ఆరోపణలు సరి కాదు

Satyam NEWS

Leave a Comment