25.7 C
Hyderabad
May 19, 2024 05: 48 AM
Slider ప్రపంచం

చైనా శత్రువు అయిన లిథువేనియా దేశంతో భారత్ మైత్రి

#primeminister

చైనా ఆంక్షలు విధించిన లిథువేనియా దేశంతో మరింత సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే బాల్టిక్ సముద్ర తీర ప్రాంతాల ఉండే దేశాలలోని పోలెండ్ తో ఈ విధమైన ఒప్పందాన్ని భారత్ చేసుకున్నది.

ఇదే తరహాలో లిథువేనియాతో కూడా సంబంధాలు పెంచుకోవాలని భారత్ నిర్ణయించుకున్నది. వన్ చైనా విధానాన్ని అనుసరించనందుకు చైనా ఈ దేశంపై ఆంక్షలు విధించింది. చైనా అభీష్టానికి వ్యతిరేకంగా తైవాన్ రాజధాని విల్నియస్‌లో ప్రతినిధి కార్యాలయాన్ని తెరవడానికి అనుమతించిన తర్వాత లిథువేనియా చైనా ఆగ్రహానికి గురైంది. ఈ ఏడాది భారతీయ మిషన్‌ను ఈ దేశంలో ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బాల్టిక్ సముద్రద తీర ప్రాంతమైన లిథువేనియాతో భారత్ ఒప్పందం మనదేశ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఏళ్ల తరబడి పరిశీలన తర్వాత ఎట్టకేలకు ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. లిథువేనియాలో భారతీయ మిషన్‌ను ప్రారంభించడం వల్ల భారతదేశ దౌత్యపరమైన సౌలభ్యం పొందుతుంది.

రాజకీయ సంబంధాలు మరియు వ్యూహాత్మక సహకారం మరింతగా పెరగడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ప్రజల మధ్య బలమైన సంబంధాలను సులభతరం చేయడం, బహుళ పక్ష వేదికలపై మరింత స్థిరమైన రాజకీయ విస్తరణకు వీలు కల్పిస్తుంది. భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాలకు మద్దతును పొందడంలో ఈ చర్య సహాయపడుతుది. లిథువేనియాలోని భారతీయ మిషన్ భారతీయ సమాజానికి మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

Related posts

ములుగు జిల్లాలో బాలల రక్షణ వారోత్సవాలు

Satyam NEWS

ప్రధాని మోడీ పిలుపునకు స్పందిస్తే మరో సమస్య వస్తుంది

Satyam NEWS

అవకాశం చిక్కితే అంతే: నారా లోకేష్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు

Satyam NEWS

Leave a Comment