25.7 C
Hyderabad
May 19, 2024 02: 43 AM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు బోస్టన్ నగరం రెడీ

#cybarabad

హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు  అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ ఈరోజు మంత్రి కే తారక రామారావుతో జరిగిన సమావేశంలో  ప్రకటించారు. ఈమేరకు బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ కి  అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ మాదిరి ఇక్కడ సైతం అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు.

హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని తద్వారా ఇక్కడి సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నయన్న విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు.

ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కే. తారకరామారావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల హెల్త్ రికార్డ్ లని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్ట్ ల తో పాటు ఐటి, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషి వలన రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలను వివరించారు.

బోస్టన్ నగరంలో ని నిర్వాణ లైఫ్ కేర్ లో జరిగిన ఈ సమావేశంలో నిర్వాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్ కేర్ ఛైర్పర్సన్ జాన్ స్కల్లి, సీఈఓ రవి ఐక, శశి వల్లిపల్లి లు పాల్గొన్నారు.

Related posts

భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Satyam NEWS

షూటెడ్:విశ్వహిందూ చీఫ్‌‌‌‌‌‌‌ రంజిత్ బచ్చన్‌ కాల్చివేత

Satyam NEWS

అక్రమ కేసు పెట్టి, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు

Satyam NEWS

Leave a Comment