ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోదారుణం చోటుచేసుకుంది. హజ్రత్ గంజ్ ప్రాంతంలోని గ్లోబ్ పార్క్ వద్ద విశ్వ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్‌పై ఆదివారం ఉదయం గుర్తుతెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తలకు తీవ్రంగా గాయమైన రంజిత్ బచ్చన్‌ను సమీపంలోని ట్రౌమా సెంటర్‌కు తరలించేలోపే ఆయన కన్నుమూశారు. అయితే కాల్పులు జరిపిన ఆగంతకులు ఆ వెంటనే పరారైనట్టు, వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.రంజిత్ బచ్చన్ హిందూ మత ప్రచార వ్యాప్తికి విశేషం గా కృషి చేసాడని పలువురు కొనియాడారు.
previous post