34.7 C
Hyderabad
May 5, 2024 02: 36 AM
Slider ప్రకాశం

అక్రమ కేసు పెట్టి, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు

#eriktionbabu

డోర్ టు డోర్ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టును టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, మన్నే రవీంద్ర ప్రజలకు వివరించారు. యర్రగొండపాలెం మండలంలోని అమానిగుడిపాడు గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం అంటూ వాదంపల్లి, అమానిగుడిపాడు యూనిట్ లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు తెలియజేసారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించారు. టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యతోనే ఒక్క ఆధారం కూడా లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు ని జైలుకు పంపారని  తెలిపారు. మచ్చలేని చంద్రబాబు కడిగిన ముత్యంలా ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Related posts

సీరియస్:పాక్ హిందూ బాలికలపై దాడులు సహించం

Satyam NEWS

ప్రతీ ఒక్కరిలో భయం…అందుకే బయటకొస్తే… మాస్క్ తొనే…!

Satyam NEWS

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

Bhavani

Leave a Comment