24.7 C
Hyderabad
May 19, 2024 02: 21 AM
Slider ముఖ్యంశాలు

పదేళ్లు రాష్ట్ర సంపదను దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు

#mallubhatti

గత పది సంవత్సరాలు ఈ రాష్ట్ర సంపద, వనరులను బీఅర్ఎస్ దోచుకున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన ఆలంపూర్ లో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన జన జాతర సభలో ప్రసంగించారు.

సాగు, తాగునీటి కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గత పది ఏళ్లలో ఇదే పాలమూరు జిల్లాకు కృష్ణా నది నుంచి అదనంగా ఒక చుక్క నీరు కూడా బీఆర్ఎస్ నాయకత్వం తీసుకురాక లేకపోయిందని డిప్యూటీ సీఎం విమర్శించారు. జూరాల, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ తోపాటు నిన్నటికి నిన్న మొదలుపెట్టిన  జూరాల నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం లోనే సాధ్యం అయ్యాయి అన్నారు.  నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక చుక్క నీరు రాకుండా అన్యాయం చేసిన బీ ఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ దేశ సంపద, వనరులు ఈ ప్రాంతానికే, ఈ దేశ ప్రజలకే చెందాలని సుదీర్ఘ పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. మనందరికీ ప్రియ తముడు కాబోయే ప్రధాని, దేశ ప్రజల కోసం ఒంటరిగా నిరంతరం పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అని అభివర్ణించారు. ఈ దేశ సంపద, వనరులు ఈ ప్రాంత ప్రజలకే చెందాలి కానీ నరేంద్ర మోడీ లాగా తన కొద్దిమంది మిత్రులు, క్రోనీ క్యాపిటల్స్ అదానీ, అంబానీలకు ధారా దత్తం చేస్తే ఈ దేశము ,ప్రజలు నష్టపోతారని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారని వివరించారు. ఈ దేశ ప్రజల తరపున ఉంటానని, వారి పక్షాన పోరాటం చేస్తానని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారని వివరించారు.

దేశ స్వతంత్రం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కృషి చేసింది. అదేవిధంగా తన బాధ్యతగా మోడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడ్డానికి పోరాటం చేస్తుందన్నారు. మనందరి కోసం, దేశం కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు.

Related posts

పెట్రోలు,డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి

Satyam NEWS

నలుగురు చేతిలో బందీ అయిన కామారెడ్డి మునిసిపాలిటీ

Satyam NEWS

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

Satyam NEWS

Leave a Comment