28.7 C
Hyderabad
April 26, 2024 08: 43 AM
Slider వరంగల్

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

satyavathi

తెలంగాణ వచ్చాక హైదరాబాద్ తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందిన నగరం వరంగల్ అయినందున ఐటి కంపెనీలు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

వరంగల్, మడికొండ పారిశ్రామిక, ఐటి కారిడార్లో నేడు క్వాడ్రంట్ ఐటీకంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్ఐఐసీ ఎండీ నర్సింహ్మ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గుండా ప్రకాశ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన వంశీరెడ్డి తన సొంత గడ్డపై అభిమానంతో ఇక్కడకు ఐటీ కంపెనీ తీసుకురావాలి, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ముందుకు రావడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

Related posts

పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి

Bhavani

మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు

Bhavani

అధికారుల అండదండలతో రేషన్ బియ్యం దందా

Satyam NEWS

Leave a Comment