30.2 C
Hyderabad
September 14, 2024 16: 11 PM
Slider నల్గొండ

బిఆర్ఎస్ కార్యకర్తల కేనా సంక్షేమ పథకాలు

#BRS workers

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గృహలక్ష్మి,డబల్ బెడ్ రూమ్ పథకాలను బిఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికారం పార్టీ నేతలు తప్పుడు ఆలోచనను మానుకోవాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి హెచ్చరించారు.

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు మొత్తం బిఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింపజేసే విధానాన్ని మార్చుకొని అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే వారిని, కానీ నేడుబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ లో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం లేదన్నారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, అందరిని కలుపుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు.

అర్హులైన పెదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21, 22 తేదీలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని తాసిల్దార్ కార్యాలయాల ముందుధర్నాల ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

పేదలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోతే 2023 డిసెంబర్ లో జరుగు ఎన్నికలలో తగిన మూల్యంబి ఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, నగరపు పాండు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మండల్ చేసిన 42 సిఫార్సులలో ఏవీ అమలుకు నోచుకోలేదు

Satyam NEWS

ఉచితంగా రేష‌న్ ఇస్తున్న ప్ర‌భుత్వం మాదే

Satyam NEWS

వల్లంపూడి స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ డీఐజీ

Satyam NEWS

Leave a Comment