28.2 C
Hyderabad
May 19, 2024 14: 08 PM
Slider మహబూబ్ నగర్

విద్యతోనే బాలికలకు భవిష్యత్తు బంగారు మయం

#CollectorSharman

నాణ్యత లోపించిన ఆహార పదార్థాలు వల్ల నాగర్ కర్నూల్ స్థానిక జ్యోతి రావు బాపూలే బీసీ కళాశాల వసతి గృహం విద్యార్థినుల అస్వస్థత ఘటనపై బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆకస్మికంగా కళాశాలను తనిఖీ చేశారు.

పాత స్టాక్ బియ్యాన్ని వండిన సోమవారం రాత్రి భోజనాన్ని తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అనంతరం కళాశాలకు చేరినా విద్యార్థినులను జిల్లా కలెక్టర్ శర్మన్ పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను విద్యార్థినులను తెలుసుకున్నారు.

వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రారంభం నాటి నుంచి అందించిన భోజన వివరాలను విద్యార్థినులు ఒక్కొక్కటిగా కలెక్టర్కు వివరించారు.

ఇకపై విద్యార్థినులకు ఏ కష్టం రానివ్వమని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మెనూ ప్రకారమే ఇకపై నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ప్రిన్సిపల్, వార్డెన్ లను ఆదేశించారు.

మెనూ ప్రకారమే భోజనం పెట్టాలి

 మెనూ ప్రకారం పెట్టకపోతే  తనకు స్వయంగా  ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. సంబంధిత ఫోన్ నెంబర్లను కూడా  విద్యార్థులకు తెలియచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్, వార్డెన్, వంట మనిషిని కలెక్టర్ వివరణ కోరారు.

మీ ఇంటిలో మీ పిల్లలకు ఇటువంటి భోజనమే పెడతారా..? అని ప్రశ్నించారు. విద్యార్థినులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. వసతి గృహ నిర్వహణలో ఏవైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే విధంగా ఆలోచన చేయాలే తప్ప ఇటువంటి భోజనం పెడతారా అని మందలించారు.

ఆహార పదార్థాల సరుకుల పై వార్డెన్‌కు సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ లో నిల్వ ఉన్న బియ్యాన్ని ఎందుకు మార్చలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండెంట్ పెట్టి నూతన స్టాక్ నుంచి బియ్యం లేకుండా గత మార్చి నుండి నిల్వ ఉండి పురుగులు పట్టిన బియ్యాన్ని వండటం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు కలెక్టర్ గ్రహించారు.

ఇదే విధమైన నిర్లక్ష్యం ఇకముందు వహిస్తే  బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.   రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగు పడే వరకు జాగ్రత్త వ్యవహరించాలన్నారు.

విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి భయం లేకుండా ఏప్రిల్, మేలో జరగనున్న  ఇంటర్ పరీక్షలకు ఆత్మస్థైర్యంతో సన్నద్ధం కావాలని, కళాశాల నుండి మెడిసిన్ లో సీట్లు సాధించి కళాశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి అన్నారు. అమ్మాయిలు కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

పాఠ్యాంశం తోపాటు శారీరక ఆరోగ్య విద్య కళలు, సంగీతం, యోగా, జీవన నైపుణ్యం మంచి అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. విద్య తోనే భవిష్యత్తు బంగారుమయవుతుందన్నారు. సమయం వృధా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని మెడిసిన్ ర్యాంకులు సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తానని అన్నారు.

మళ్లీ కళాశాలను అనేకమార్లు సందర్శిస్తానని విద్యార్థినిలకు కలెక్టర్ భరోసానిచ్చారు. భయాన్ని వీడి చదువు పైన శ్రద్ధ వహించాలన్నారు.

Related posts

మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా టెట్ పరీక్ష

Bhavani

జిల్లాలో మంత్రులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు…!

Satyam NEWS

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment