38.2 C
Hyderabad
April 28, 2024 22: 31 PM
Slider ఖమ్మం

మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా టెట్ పరీక్ష

#Bhadradri Kothagudem

ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కు అవకాశం లేకుండా పకడ్బందీగా టెట్‌ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణపై ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో చీఫ్ సూపర్టెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు, రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు సీటింగ్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు.

ఈ నెల 15 తేది ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం నిర్వహించే మొదటి పేపర్ పరీక్షకు 37 కేంద్రాలు, సాయంత్రం నిర్వహించే రెండో పేపర్ పరీక్ష నిర్వహణకు 29 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం లల్లో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాల్లో 8,717 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో 16 కేంద్రాలు, పాల్వంచ మున్సిపాలిటీలో 6 కేంద్రాలు, మణుగూరు లో 8, భద్రాచాలంలో 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సాయంత్రం నిర్వహించే రెండో పేపర్ పరీక్షకు కొత్తగూడెం లో 16, పాల్వంచలో ఒకటి, మణుగూరులో 5, భద్రాచలంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్‌ విధించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణకు 380 మంది ఇన్విజిలేటర్లు, 148 మంది హాల్ సూపరింటెండెంట్లు, 37 మంది శాఖ పరమైన అధికారులు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 రూట్లకు 9 మంది రూటు అధికారులు, 9 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో సిసి టివి లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుతో పాటు, తగినన్ని మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.

సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని చెప్పారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడవని, నిశిత పరిశీలన తదుపరి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు.

ఈ సమావేశంలో డిఆర్వో రవీంద్రనాధ్, డీఈఓ వెంకటేశ్వరచారి, పరీక్ష నిర్వహణ సహాయ కమిషనర్
ఎస్ మాధవరావు, చీఫ్ సూపరింటెండెనట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూటు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్యాక్ట్ ఫైండింగ్:చంద్రబాబు మనుషుల ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS

జగన్ ప్రభుత్వం పరువు తీసిన విజయసాయిరెడ్డి

Bhavani

ప్రధాని విశాఖ పర్యటనలో బిజీ బిజీ

Bhavani

Leave a Comment