25.7 C
Hyderabad
May 19, 2024 08: 18 AM
Slider కడప

మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్న దుర్మార్గులు

#Kadapa DWAKRA

పేద మహిళల పొదుపుతో కుటుంబాలకుఅండగా నిలిచే విధానం రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలను కొందరు అధికారుల అండ దండలతో యాని మేటర్ల కక్కుర్తి కారణంగా రుణాలను స్వాహా చేసి మహిళలను కంట కన్నీరు పెట్టిస్తున్నారు.

కడప జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లె లో డ్వాక్రా రుణాల మంజూరులో 5 లక్షల పైగా రుణాలు మంజూరు చేసి యాని మేటర్ స్వాహా చేసిందని పోలీస్ స్టేషన్లో డ్వాక్రా సంఘాల బాధితులు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని రెండు డ్వాక్రా బృందాలు అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

తూతూ మంత్రంగా విచారణ

దీనిపై శుక్రవారం డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ మనోహర్ బాధితులు పనులకు వెళ్లినప్పుడు తూతూ మంత్రంగా విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన సంఘాల వారికి డి.ఆర్.డి.ఏ.ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ మనోహర్ ఏ.యం.ఓ రజని ఫోన్ ద్వారా పిలువగా చాలా మంది కూలి పనులకు వెళ్లడంతో వారి రాలేదు.

ఉన్న కొద్దీ మందిని తూతూ మంత్రంగా విచారణ జరిపి ఫిర్యాదులు అవాస్తవమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగిరెడ్డి పల్లె వి-6 యానిమేటర్ అనుకూలంగా ఉన్నవారి చేత రాత పూర్వకంగా రాసి ఇవ్వమని డి.ఆర్.డి.ఏ.ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ మనోహర్ చెప్పడం విచారణ లోని డొల్లతనం బయట పడుతోంది. నందలూరు మండల కేంద్రంలోని పలు డ్వాక్రా సంఘాల్లో గోల్ మాల్  చోటుచేసుకుంది.

పట్టించుకోని పై అధికారులు

డ్వాక్రా సంఘాల్లోని గ్రూప్ సభ్యులకు తెలియకుండానే వెలుగు శాఖలో పనిచేసే కొందరు గుట్టుచప్పుడు కాకుండా లక్షలు మింగినట్లు బాధిత మహిళలు వాపోతున్నారు. అనేక సంవత్సరాలుగా పలు గ్రూపుల్లో ఇదే పరిస్థితి నెలకొందని పై అధికారులకు తెలిపిన ఎవరూ పట్టించుకోవడం లేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము తీసుకున్న రుణాల సొమ్మును చెల్లిస్తున్న ఆ సొమ్ము మొత్తం కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో తాము కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అలాగే జిల్లా కలెక్టర్ కు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపుతున్నట్లు బాధితులు తెలిపారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపితే భారీ స్థాయిలో పలు గ్రూపుల్లో గోల్మాల్ చోటు చేసుకున్న విషయాలు బహిర్గతం అవుతాయని వారు పంపిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

Related posts

కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీపీఐ నాయకులు

Bhavani

అధికారం ముగిసే ఈ కాలంలో కొత్త కాపురం ఎందుకో…?

Satyam NEWS

కళాతపస్వి కి తెలంగాణ సి ఎం కేసీ ఆర్ పలుకరింపు

Satyam NEWS

Leave a Comment