34.2 C
Hyderabad
May 20, 2024 18: 07 PM
కవి ప్రపంచం

వంగర బంగారం

#Muttukuru Srikanth

వరంగల్ ల జన్మించినా

కరీంనగర్ ల నడయాడినా

వందేమాతరమని నినదించిన

వంగర బంగారానివి పీ.వీ.

ఎన్నిభాషలు నేర్చినా

అన్నీ ఉన్న ఆకులా

ఉన్నతమైన విలువలున్న

సమున్నత కవి పీ.వీ.

ముఖ్యమంత్రిత్వం అచ్చిరాకున్నా

భూసంస్కరణ నిను భుజానికెత్తుకోకున్నా

నమ్మినదానికే నిలబడాలన్న

విలువల పూతావి పీ.వీ.

మౌనమే మహాయజ్ఞమనీ

ఆర్థికసంస్కరణలే వేదమంత్రాలని

చాణక్యమే కాచుకునే బాణమని

భారతావని బరువు మోసిన మేధావి పీ.వీ.

వేయిపడగల ముద్దాడిన

నీ జయప్రభను

ఆత్మకథగా చదువుకోగలగడం

దేశప్రజల అదృష్టం.

ముత్తుకూరు శ్రీకాంత్, కందుకూరు, ప్రకాశం జిల్లా

Related posts

‘శోభా’ గమనం

Satyam NEWS

తపన

Satyam NEWS

కీర్తి శిఖరం

Satyam NEWS

Leave a Comment