39.2 C
Hyderabad
May 3, 2024 13: 06 PM
Slider కవి ప్రపంచం

చైతన్య కిరణం

#Puli Jamuna

ఆవరించిన అంధకారాన్ని తొలగించి

కాంతి పుంజమై వెలుగులీనుతుంది

అంతరంగంలో కదలాడే భావాలకు

అద్భుత  ఆకృతిని సంతరించుకుని

విశ్వ విజ్ఞాన బాంఢాగారమయ్యింది

అవినీతి అక్రమాలకు సింహస్వప్నమై

అక్షరమే ప్రశ్నించే శంఖారావమయ్యింది                              

సమాజాన్ని తట్టిలేపే సమరనాదమై

అధర్మానికి నిరసన గీతమయ్యింది

కులమతాల విద్వేషాలను నిరసించి

గర్జించే తిరుగుబాటు గళమయ్యింది

మమతా సమతా మానవతా తోరణమై

సమాజ జీవన సౌరభాలు వెదజల్లింది

ఆలోచనలకు ఆవిష్కరణలకు ఆలంబనయై

అక్షరమే నిత్య చైతన్య కిరణమయ్యింది

అమూల్యమైన అక్షరమే ఆత్మీయ నేస్తమై

జీవితాలను పరిమళింపచేసే పారిజాతమయ్యింది

(అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా)

పులి జమున

Related posts

వింత ఆచారం:గ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే

Satyam NEWS

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు

Satyam NEWS

షాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment