23.7 C
Hyderabad
May 8, 2024 05: 07 AM
కవి ప్రపంచం

ధన్యజీవి మన పీవీ

#Jasthi Jhansilaxmi

ధన్యజీవి మన పీవీ

పుణ్య జీవి మన పీవీ

తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టినదా ఠీవి !

తెలుగువాడు ఎక్కలేని పీఠమే లేదంటూ

ప్రధాన మంత్రి పదవికే వన్నె తెచ్చిన జీవి !

లేలేత పదిహేనేండ్ల ప్రాయంలో

నైజామునే ఎదిరించి స్వతంత్ర గీతాన్ని ఆలపించిన ధీశాలి !

చదువుల తల్లి ముద్దు బిడ్డవి

14 భారతీయ భాషల్లో  కోవిదుడివి !!

రాజకీయాల్లో కాలుబెట్టి  అన్ని పదవులలంకరించి

దక్షిణాదిత్యుల ప్రాబల్యం దేశానికి చాటి చెప్పి

ప్రధాన పీఠమలంకరించి

ఆర్ధిక సంస్కరణలతో దేశప్రజకు మేలుచేసి

కులమతాలకతీతంగా అందరి మన్ననలు పొంది

తెలుగువాడి బుద్ది బలం ప్రపంచాన చాటి చెప్పి

అపర చాణక్యుడివై వెలుగొందినావు !!

విశ్వనాథుని వేయిపడగలు హిందీలో అనువదించి

ఇన్సైడర్ అంటూ నీ ఆత్మకథ ను విరచించి

సాహితి క్షేత్రంలో సైతం చెరగని ముద్ర వేశావు !

ఇంత గొప్ప “మనీషి కి” “మహర్షికి” అంతిమ వీడ్కోలు సైతం

రాజకీయం చేసి చిన్న బుద్దులు చాటుకున్న పెద్దమనుషుల వైనం

కాంచకుండా పోయి నిజంగానే ధన్యజీవివైనావయ్యా !!

ఎన్నో ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడై , తెలుగువారి ఖ్యాతి ని దేశపటం లో అగ్రభాగాన నిలబెట్టిన పూజ్యులు శ్రీ పివి నరసింహారావు గారి దివ్యస్మృతికి ఇది నా అక్షర నివాళి !

జాస్తి ఝాన్సీ లక్ష్మి

Related posts

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

చిరుకాంక్ష

Satyam NEWS

దివ్యచరితుండు

Satyam NEWS

Leave a Comment