31.7 C
Hyderabad
May 2, 2024 09: 21 AM
Slider కవి ప్రపంచం

తపన

#K.Harinath

నా ప్రేయసి కందించిన

మల్లెలమాలను

తలలో తురుముకుంటున్నప్పుడు

నా కనిపించింది

ఆ మల్లెల మాలను

నేనైతే ఎంత బాగుండునని…

ప్రేమతో నా ప్రేయసికి

కాలిగజ్జెలందించినప్పుడు

నా కనిపించింది

ఆ గజ్జెలు నేనైతే ఎంత బాగుండని…

సుమ సుగంధాల పర్ఫ్యూమ్ ఇచ్చినప్పుడు

నా కనిపించింది

ఆ పర్ఫ్యూమ్ నేనైతే ఎంత బావుండని…

ఓ చేతి గడియారం

బహుమతిగా ఇచ్చినప్పుడు

నా కనిపించింది

ఆ గడియారం నేనైతే ఎంత బాగుండని…

ఈ సొదంతా ఎందుకు

అనుక్షణం క్షణక్షణం

తనని అంటిపెట్టుకుని

ఉండాలన్న తపనే

ఈ ప్రియుడి ఆరాటం

కె.హరనాథ్, 9703542598

Related posts

దగ్గు మందు తాగి 18 మంది చిన్నారుల మృతి

Satyam NEWS

హెల్మెట్ దరించట గురించి అవగాహన ర్యాలీ

Satyam NEWS

Gun culture: బాల్యాన్ని హత్య చేస్తున్న అమెరికా తుపాకి

Satyam NEWS

Leave a Comment