27.7 C
Hyderabad
May 14, 2024 07: 53 AM
కవి ప్రపంచం

కీర్తి శిఖరం

#A.Mohana Murali Kumar

పీ.వి అంటేనే ఒక మహా రాజ ఉద్గ్రంధ రాజము

ఆ గ్రంధ మౌన భాషే సమస్యల పరిష్కార నిఘంటువు

నిజాం నిరంకుశత్వ పరిపాలనను కలంతో పదును పెట్టించి

జవనాశ్వ వేగంతో ఎదుర్కొని గర్జించిన మృగరాజు

శాంతి కపోతాన్ని ఎగురవేసి రాచరిక విముక్తికి నిజాం

తిమిరంతో సమరం చేసి విముక్తి పథంలో నడిపించిన

లక్నేపల్లి గ్రామ జన్మస్తుడు వంగర గ్రామ దత్త పుత్రుడు

స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ఙ్ఞాన సమర యోధుడు

బహు భాషా కోవిదుడు అపర చాణక్య బిరుదాంకితుడు

శిశిరంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థ ను చైత్రంగా మార్చిన ఘనుడు

మైనారిటీ ప్రభుత్వానికి పూర్తికాలం ప్రధాన మంత్రి గా భారత దేశ చరిత్రలో తలెత్తి ఠీవిగా  నిలిచిన మైలురాయి

రాజకీయం కన్శా దేశ సౌభాగ్యామే మిన్నగా భావించిన

దేశభక్తి పరాయణుడు అనన్య అసామాన్య మణిపూస

అన్ని విషయాలు కరతలామలకం నైపుణ్యం తో పరిష్కారం

రాజనీతిజ్ఞతకు బుద్ధి కుశలతకు సంస్కరణలకు ఆద్యుడు

విపక్షాల బలాన్ని బలహీనతలను అంచనాతో ఔపోసన పట్టి

చక్కటి ప్రణాళికతో ప్రజారంజక పరిపాలన చేసిన మేథావి 

స్థిరమైన గమ్యం కచ్చితమైన మార్గదర్శనంతో విజయాలు జనవంద్యులుగా కీర్తి  శిఖరాన వెలుగొందిన నిరాడంబరుడు

ఏ.మోహన మురళి కుమార్, సెల్ నం 9849635488

Related posts

పీవీకి నివాళి

Satyam NEWS

“ఆత్మ” బంధువు

Satyam NEWS

కర్మయోగి

Satyam NEWS

Leave a Comment