24.7 C
Hyderabad
May 19, 2024 02: 10 AM
కవి ప్రపంచం

గుప్పెడు మట్టి

#NutenkiRavindar22

నడుస్తూ ఉంటాను తొవ్వల

ఉన్నట్టుండి చటుక్కున నిలిచి పోతాను-

ఎవ్వలో చెయ్యి పట్టుకొని గుంజినట్టై

మూడువందల అరవై డిగ్రీల మేర

పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరికిస్తానా –

లాగిన నయనమేదీ కనిపించదు

కాలూ ముందుకు సాగదు

రక్షలు తీసేసి పాదాల్ని

నేల మీద మోపుతాను

మట్టి గట్టిగా చుట్టుకుంటుంది

విద్యుదయస్కాంత భూ తరంగాలేవో

నరాల్లో రుధిర సంద్రాన్ని పోటెత్తిస్తాయి

గుప్పెడు మట్టిని దోసిట్లోకి తీసుకుంటాను

రక్తమూ చెమటా కన్నీరూ కలగలసిన

వెగటు వాసనేదో నా పూర్వీకుల స్పర్శై ముక్కుపుటాల్ని ఘాటుగా ముద్దాడుతుంది

రేణువులు వేణువులై వాళ్ళ గాథల్ని గానం చేస్తుంటే

రోమాంచితమైన దేహవాహనంలోని మనసు

యుగాల యాత్ర చేసి వస్తుంది

చిటికెడు మట్టి తీసి నుదుట బొట్టుగా ధరిస్తాను

అడుగు పడవై సూటిగా దూసుకెళుతుంది

ఇప్పుడు

భూగోళమ్మీద యెక్కడ

గుప్పెడు మట్టిని ముట్టుకున్నా

నా ఆనవాళ్ళే! నా అన్నవాళ్ళే!!

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295

Related posts

ఒక వేణువు ఆగింది

Satyam NEWS

విధివంచిత

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

Leave a Comment