40.2 C
Hyderabad
May 5, 2024 17: 48 PM
Slider కవి ప్రపంచం

నవ వసంతం

#Nareddula Rajareddy

వసంతాల ముంగిట్లో

హరివిల్లుగా వాలిపోయి

ముగ్గులుగా మెరిసింది

ప్లవ నామ సంవత్సరాది

షడ్రుచుల సమ్మేళనంలో

సుఖ దుఃఖపు త్రాసుగా

సమపాళ్ళుగా నిలిచింది

వసంత గీతపు కోకిలగా

నవ వసంతపు రాగమై

పాడి పంట సిరులు లొలుకు

సవ్వడిగా వచ్చింది ఉగాది

గత కాలపు గతుకులను

వడివడిగా దాటుకుంటూ

భవిత కొరకు బంగరు బాటై

ఆరోగ్యంగా నడిపించుటకై

కలిసి వచ్చింది ప్లవ యుగాది

తెలుగు సంవత్సరం తేటగా

తిథి వార నక్షత్ర ఫలితమై

మానవాళి మేటి మనుగడకై

ముందు చూపుగా ఏతెంచింది

ప్లవ నామ యుగాది వత్సరం

క్రిమి సంహారక ఆయుధమై

భువియందు జనుల మేలుకై

తరలి వచ్చింది ఉగాది

నరెద్దుల రాజారెడ్డి, గోరంట్ల, అనంతపురం జిల్లా, ఫోన్ : 9666016636

Related posts

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Sub Editor

వాజ్ పేయి జయంతి సందర్భంగా బ్రెడ్డు పండ్లు పంచిన ఎన్వీఎస్సెస్

Bhavani

శాశ్వత నిర్మాణాలలో భాగంగా సిసి డ్రైనేజీ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment