36.2 C
Hyderabad
May 15, 2024 15: 16 PM
Slider ప్రత్యేకం

జగన్ ను ఇరకాటంలో పెడుతున్న ‘గురు ఛండాల యోగం’

#jagan

గురు ఛండాల యోగం…. చాలా అరుదుగా వచ్చే ఈ గ్రహ యోగం ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. ఎంత త్వరగా విశాఖ పట్నం తరలి వెళ్లిపోయి అక్కడ నుంచి పరిపాలన సాగిస్తే ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని ఎంతో ఆత్రుతతో ఉన్న జగన్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో నాలుగైదు సార్లు ముహూర్తాలు పెట్టుకుని కూడా ఆయన విశాఖ పట్నం తరలి వెళ్లలేకపోయారు.

విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తే ప్రస్తుతం ఉన్న చెడు అంతా తొలగిపోతుందని, అంతా మంచే జరుగుతుందని చాలా కాలం కిందట ‘‘రాజ గురువు’’, విశాఖ శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ కు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. రాజగురువు స్వరూపానందేంద్ర సలహా మేరకు జగన్ విశాఖ పట్నం తరలి వెళ్లేందుకు శత విధాలా ప్రయత్నించారు.

అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం వచ్చి విశాఖపట్నం తరలి వెళ్లే కార్యక్రమం వాయిదా పడుతూ వస్తున్నది. ఇప్పటికే స్వరూపానందేంద్ర పెట్టిన ముహూర్తాలన్నీ కూడా తప్పిపోయాయి. తాజాగా సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడే కాపురం పెట్టబోతున్నానని జగన్​ వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే అక్కడికి వస్తున్నట్లు జగన్‌ చెప్పారు.

అయితే తాజా గ్రహ గతులను పరిశీలిస్తే జగన్ సెప్టెంబర్ లో కూడా విశాఖపట్నం తరలి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. గురు ఛండాల యోగం ప్రకారం జగన్ కు సమస్యలు మరింత తీవ్ర అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. ఏప్రిల్ 22 వ తేదీ సాయంత్రం వరకూ గురువు మీనరాశిలో ఉంటాడు. 23వ తేదీ నుంచి గురువు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

ఇప్పటికే మేష రాశిలో రాహువు ఉన్నందున రాహువుతో గురువు కలవడంతో గురు ఛండాల యోగం కలగబోతున్నది. గురువు మేష రాశిలోకి ప్రవేశించే సమయానికి దేశంలోని ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సారి గంగా నది పుష్కరాలు వస్తున్నాయి. గురు గ్రహం రాహువుతో లేదా కేతువుతో కలిస్తే రాజకీయంగా విపరీత పరిణామాలు ఉంటాయి. గురు గ్రహం రాహు లేదా కేతులతో కలిసి ఉండటం అనేదాన్ని గురు ఛండాల యోగం అంటారు.

ఈ గురు ఛండాల యోగం కాలం రాజకీయ నాయకులకు, అందులోనూ అధికారంలో ఉన్న వారికి అతి క్లిష్టమైన కాలం. ఈ సంక్లిష్ట కాలంలో అధికారంలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతారు. మానసికంగా వత్తిడికి గురి అవుతారు. రాజకీయ సమస్యలతో బాటు వ్యక్తిగత సమస్యలతో పాలకులు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటారు. గురువు ప్రతి ఏటా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారుతుంటాడు.

రాహువు ప్రతి 18 నెలలకు ఒక సారి రాశి మారుతుంటాడు. ఈ రెండు గ్రహాలు మేషరాశిలో కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా జరగడాన్ని గురు ఛండాల యోగం అంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దారుణమైన గురు ఛండాలయోగం నవంబర్ 2 వరకూ ఉంటుంది. అందువల్లే జగన్ తాను విశాఖ కు తరలి వెళతానని చెబుతున్నా కూడా నవంబర్ 2వ తేదీ వరకూ అలా జరిగే అవకాశమే కనిపించడం లేదు.

గురు ఛండాలయోగం సమయంలో పరిపాలనా కేంద్రాన్ని మార్చుకుంటే సమస్యలు తీవ్ర అవ్వడమే కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు. అందుకే జగన్ పరి పరి విధాల ఆలోచించుకుంటూ రాజ గురువులను మార్చుకుంటూ ప్రముఖ జ్యోతిష్కుల సలహాలు తీసుకుంటూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గురు ఛండాల యోగం జగన్ రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటున్నది.

Related posts

సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani

విద్యల నగరంలో గంజాయి…..!

Bhavani

Leave a Comment