28.2 C
Hyderabad
May 19, 2024 11: 24 AM
Slider జాతీయం

స్వేచ్ఛకు పర్మిషన్ ఇచ్చిన పండుగ దినం

Indian-Flag-HD-Wallpaper

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

పోరాట ఫలితం గా సిద్దించిన స్వాతంత్ర్యం ఎలా ఉపయోగించుకోవాలి? దేశం లో ఉన్న ప్రజలకు సమాన హక్కులు ఎలా అందించాలి? దేశం లో అన్ని ప్రాతాల అభివృద్ధికి, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల, మైనార్టీలకు ఎం చేస్తే వారు సమ న్యాయం పొందుతారు? అసలు భారత దేశ పౌరుడికి ఉన్న వ్యక్తిగత హక్కులు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? అని నిర్దేశించేదే భారత రాజ్యాంగం.

అంతే కాదు అవి అమలు అయ్యే విధంగా చూడటం ఎలా? దేశం లో మహిళా సంరక్షణ ఎలా జరగాలి ? చట్టం ఏమిటి ?న్యాయం ఏమిటి ? వీటిని ప్రజలకు అందించి వారు ఆయా ఫలితాలు సక్రమం గా పొందుతున్నారా లేదా చూడటానికి ఒక నియమావళి కావాలి అదే మన భారత రాజ్యాంగం. అది అమలు లోకి వచ్చిన రోజే రిపబ్లిక్ డే. ఒక దేశపు రాజ్యాంగ రచించి దానిని  అమలుకు శ్రీకారం చుట్టిన  రోజు.

దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకుని, జరుపుకునే జాతీయ దినోత్సవమే ‘రిపబ్లిక్‌ డే’. భారతదేశంలో  రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి 1950 ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బ్రిటీషు కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 కు చరమ గీతం పాడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైన దినమే ఈ రిపబ్లిక్ డే .

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది. దీనికి అధ్యక్షులుగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు.

అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందినది మన రాజ్యాంగం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26, నుంచి అమలుపరచడంతో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయ్యింది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు ప్రజల పరిస్థితులను  చూసి వారి బాగోగులకు చేయు  చట్ట న్యాయ సవరణల సమ్మిళితమే ఈ దినం. అందుకే ఏ ఏటికా ఏడు భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తూ ఈ రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటాం. ఒక విధం గా మన స్వేచ్ఛకు అవకాశమిచ్చిన పండుగ దినమే ఈ ‘రిపబ్లిక్‌ డే’.

Related posts

చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

కరోనాపై పోరాటానికి బూచేపల్లి విరాళం రూ.25 లక్షలు

Satyam NEWS

అప్పులు ఇప్పిస్తామని మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్

Satyam NEWS

Leave a Comment