29.7 C
Hyderabad
April 29, 2024 10: 14 AM
Slider వరంగల్

అప్పులు ఇప్పిస్తామని మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్

#warangalpolice

బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను ఐనవోలు పోలీసులు అరెస్టు చేసారు. ఈ సంఘటనలో పోలీసులు మనోజ్ సైస్వాల్ అజంఘడ్, యూపీ, జ్ఞానేంద్ర యాదవ్, అజంఘడ్, యూపి, రాజ కుమార్, వార్సాలిగంజ్, బిహర్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వీరి నుండి ఒక లక్ష ఏడు వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పెద్ద మొత్తంలో ఆన్లైన్ ద్వారా బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని ఇండియా బుల్స్ మేనేజర్ పేరుతో ఒక లక్ష 36 వేల రూపాయలను సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసానికి గురైన బొంత రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఐనవోలు పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ అధ్వర్యంలో నేరస్థులను పట్టుకోనేందుకుగాను ఐనవోలు ఎస్.ఐ భరత్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం బీహర్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు తరలి వెళ్ళి చేపట్టిన దర్యాప్తులో నేరానికి పాల్పడిన నేరస్థులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకోని వారి నుండి సెల్ ఫోన్లతో పాటు సిమ్ కార్డులు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం దర్యాప్తు పోలీస్ బృందం నిందితులను స్థానిక అజంఘడ్ కోర్టులో హజరపర్చి తిరిగి వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకరావడంతో నిందితులు సైబర్ నేరాల పాల్పడేందుకుగాను వినియోగించే సెల్‌ నంబర్లు, బ్యాంక్ ఖాతాలు, యూ.పి.ఐ ఖాతాల వివరాలపై పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ విశ్వేశ్వర్ విచారణ అనంతరం నిందితులను వరంగల్ కోర్టులో హజరు పర్చడం జరిగింది. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ మామునూర్ ఏసిపి నరేష్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్, ఐటీకోర్ ఇన్స్ స్పెక్టర్లు విశ్వేశ్వర్ నరేష్ కుమార్, ఐనవోలు ఎస్.ఐ భరత్, ఏఏఓ సల్మాన్‌షా, ఎఎస్ శర్మ, కానిస్టేబుల్లు శ్రీనివాస్, అన్వర్, రాకేష్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related posts

కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

Sub Editor 2

డెంగ్యు నివార‌ణ‌పై గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన చర్యలు

Satyam NEWS

ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

Leave a Comment