36.2 C
Hyderabad
May 15, 2024 15: 20 PM
Slider ఖమ్మం

బిజెపికి తెలంగాణలో స్థానంలేదు

#kunamneni

మునుగొడు ఫలితంతో బిజెపికి  తెలంగాణలో స్థానంలేదని స్పష్టమైందిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరైన ఆయన మాట్లాడుతూ విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయడంతోపాటు కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ, మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకోసం కాకుండా అదాని, అంబానీ లాంటి కుబేరులకు కోసం పనిచేస్తున్నాడని విమర్శించారు. మునుగొడు ఫలితంతో మతోన్మాద బిజెపి తెలంగాణలో స్థానంలేదని స్పష్టమైందన్నారు.  భూమిపై ఉన్న ప్రతి పేదవాడికి పొడుపట్టా అందేలా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజాక్షేత్రాలకు పరిమితమై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలను పోరాటాల వైపు చైతన్యవంతం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా మాట్లాడుతూ గడపగడపకు పార్టీ ప్రాధమిక సభ్యత్వం చేరవేసి సీపీఐ ను మరింత బలోపితం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.   ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, బందెల నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాస్, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు వీ పద్మజ, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, వెంకట్రామయ్య, వేములపల్లి శ్రీను, జ్యోతుల రమేష్, ఆవుల సతీష్, లక్ష్మి, సర్పంచ్ భూక్య రమేష్, తోట వెంకన్న, రామచందర్, హేమలత, శివరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరువు నష్టం కేసులో హాజరు నుంచి రాహుల్ కు మినహాయింపు

Satyam NEWS

తెలంగాణ భవన్ లో విమోచన దినం

Satyam NEWS

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టుల మృతి

Satyam NEWS

Leave a Comment