40.2 C
Hyderabad
May 5, 2024 18: 17 PM
Slider ఖమ్మం

విద్యార్థులకు మెరుగైన వైద్యo

#nama

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థకు గురైన విద్యార్థులకు సత్వరమే మెరుగైన వైద్యo అందేలా చర్యలు తీసుకోవాలని  టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి దయానంద్ స్వామిని ఆదేశించారు .  హైస్కూల్ లో విద్యార్థులు భోజనం తినగా వారిలో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న కొద్ది సేపటికి విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని చండ్రుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఎంపీ నామ వెంటనే డీఎంహెచ్ ఓ దయానంద్ స్వామి కి ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అవసమైతే వెంటనే కొత్తగూడెం తరలించాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ  విద్యార్థులకు అవసరమైన మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఎంపీ నామ ఆదేశాలతో పార్టీ మండల అధ్యక్షులు దారా బాబు, ఉపాధ్యక్షులు సూర వెంకటేశ్వర్లు, గుంపెన సొసైటీ అధ్యక్షులు నల్లమోతు వెంకట నారాయణ, నాయకులు మేడా మోహనరావు తదితరులు హైస్కూల్ కు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకొని వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, దగ్గర ఉండి వైద్య సేవలు పర్యవేక్షిస్తున్నారు. వారిని నామ అభినందించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని నామ అధికారులను కోరారు.

Related posts

లిక్కర్ కేసులో సీఎం కేసీఆర్ బిడ్డ అరెస్ట్ ఖాయం

Satyam NEWS

పీఆర్ ప్రాజెక్ట్ పనులకు కావలసిన భూసేకరణను వేగవంతం చేయాలి

Satyam NEWS

సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు…స్పందించవద్దు..

Satyam NEWS

Leave a Comment