35.2 C
Hyderabad
April 27, 2024 13: 10 PM
Slider నల్గొండ

ప్రాచీన కళలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

#DevarakondaSportsAssociation

ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు దేవరకొండ నియోజకవర్గంలోని జానపద కళాకారులను మెమొంటోశాలు తో సన్మానించారు.

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా విచ్చేసిన  స్థానిక సిఐ ఆది రెడ్డి మాట్లాడుతూ కళాకారుల  కళారూపాలు వెలకట్టలేనివని మూడు గంటల ఉపన్యాసం కంటే మూడు నిమిషాల పాట ఎంతో చైతన్యం కలిగిస్తుందని అన్నారు.

 ప్రాచీన జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద వుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో కళాకారులు, కిషన్ లాల్, ఖలీమ్,   జనీబాబా, పెంటోజీ నల్ల నర్సింహా, క్రాంతి మాస్టర్ ,కృష్ణయ్య, సలేశ్వర్, సత్యం, గురుమూర్తి, వెంకటయ్య,చి రంజీవి, పాండు, లావణ్య, కోటిలను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి తాళ శ్రీధర్ గౌడ్, కోశాదికారి క్రిష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, పంతులాల్, ఉమామహేష్, sto ప్రసన్న, భాస్కర్ రెడ్డి,తాళ్ల సురేష్,పూర్య, శ్రీనివాస్ రెడ్డి, ఆర్య,జగన్ ,ప్రేమ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.

Related posts

ఐజేయూ నేతలతో డిల్లీ జర్నలిస్టుల భేటీ

Bhavani

కృష్ణ నదిలో ప్రయాణించిన వారిపై కేసు నమోదు

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment