28.2 C
Hyderabad
May 19, 2024 10: 52 AM
Slider వరంగల్

సీపీఐ నేతలు అరెస్ట్

#CPI leaders

విభజన హామీలను అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ లో నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా వంటివి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవని తెలిపారు. ఈ నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు తదితర నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్నిఅయన తప్పుబట్టారు.

Related posts

శరాఘాతాల్లా తగులుతున్న చిరువిమర్శలు

Satyam NEWS

వంట గ్యాస్ పెంపుదలతో పెల్లుబికిన ప్రజా  ఆగ్రహం

Satyam NEWS

నిర్వాసితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో

Satyam NEWS

Leave a Comment