26.7 C
Hyderabad
May 3, 2024 10: 30 AM
Slider సంపాదకీయం

శరాఘాతాల్లా తగులుతున్న చిరువిమర్శలు

#YSR Congress Party top Leaders

ప్రభుత్వ పరంగా జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన ఆ నలుగురు ఇప్పుడు వైసీపీలో హీరోలు గా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఒకరు, మద్యం మాఫియా అదుపుకాని నేరాలు చేస్తున్నదని ఒకరు, ఇళ్లు కట్టిస్తామని చెబుతూ డబ్బులు నొక్కేస్తున్నారని మరొకరు, ఆఖరికి నీళ్లను కూడా అమ్ముకుంటున్నారని మరొకరు బాధ్యతగల ప్రజాప్రతినిధులే ఇటీవల సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజు, శాసనసభ్యలు మహీధరరెడ్డి, బ్రహ్మనాయుడు, ఆనం రామ నారాయణ రెడ్డి తమ తమ ప్రాంతాలలో జరుగుతున్న అక్రమాల దందాలపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో బలమైన కమ్మ సామాజిక వర్గం కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గుంటూరు జెడ్ పీ సమావేశంలో బహిరంగంగా, రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్న తీరు పై గళం ఎత్తారు.

ఇసుక రీచ్ నుంచి, ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావటం లేదని, గరమల్లో గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేక పోతున్నామని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తి సంచలనం సృష్టించారు. జగన్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉంది.

ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పింది. దీన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉంది. సరిచేయకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు అని సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆయన ఆందోళన చేశారు కూడా.

ఇక నిన్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాది కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఏది, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఇంకో ఏడాది చూస్తా, ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఇళ్ళ స్థాలల్లో అవినీతి, రాష్ట్రంలో మత మార్పిడులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్డినెన్స్, తిరుమల భూవివాదం, ఇలా అన్నిటి పై, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరుగుతున్నారు.  నలుగురేకదా ఎదురుతిరిగింది అనుకోవడానికి వీల్లేదు.

స్పీకర్ తమ్మినేని నాటు సారా మాఫియా పై చేసిన వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీళ్ళు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, కరెంటు బిల్లుల పెరుగుదల పై, విజయనగరం జిల్లా సాలూరు వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర వ్యాఖ్యలు, ఇలా చాలా మంది పరిపాలనపై వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు.

అదే విధంగా చాలా జిల్లాల్లో వైసీపీలో వర్గ పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది.

Related posts

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే

Satyam NEWS

హంటింగ్ కంటిన్యూస్: టిడిపి నాయకుడికి నోటీసులు

Satyam NEWS

12న జరిగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత భేరి జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment