24.7 C
Hyderabad
May 13, 2024 06: 53 AM
Slider తూర్పుగోదావరి

కోనసీమ జిల్లా అల్లర్లు భావోద్వేగం కారణంగా జరిగినవే

#satyakumar

భారతీయ జనతా పార్టీ యువ సంఘర్షణ యాత్ర లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై .సత్య కుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధిలో పర్యటించారు. బెండమూర లంక లోని రాష్ట్ర బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు ఇంటిలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు ప్రయత్నించారని అన్నారు.

దానికి సంబంధించిన పాత్రధారులు సూత్రధారులు ఎవరో ముఖ్యమంత్రికి తెలుసునని ఆయన అన్నారు. భావోద్రేకంతో చేసిన అల్లర్లే తప్ప వారంతా పేరు మోసిన రౌడీ షీటర్లు కాదని సత్యకుమార్ అన్నారు. కేసుల్లో నిందితులు చాలా మంది రాజకీయాల్లో ఎంతో మంది ఉన్నారని పదవులు వచ్చిన తరువాత వారిపై ఉన్న కేసులు ఉపసంహరించు కోవడం జరిగిందని ఆయన తెలిపారు.

అయితే కోనసీమ అల్లర్లలో అరెస్టు అయిన వారు 70 రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని సత్యకుమార్ అన్నారు. వారి కుటుంబాల బాధలు వర్ణనాతీతమని భార్యాపిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడే ప్రమాదం ఉందని మానవతా దృక్పథంతో ఆలోచించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సాయిల్ కార్డులు ఇప్పుడు అగుడుతారేంటి?

ముఖ్యమంత్రి జగన్ కు రైతుల సాధకబాధకాలు తెలిసి ఉంటాయని తాను భావించానని అయితే ముఖ్యమంత్రి అయిన మూడున్నర సంవత్సరాల తర్వాత సాయిల్ హెల్త్ కార్డులు మంజూరు చేయమని కోరడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఏనాడో సాయిల్ కార్డులు ప్రారంభించారని, ప్రధానమంత్రి అయిన తర్వాత 24 కోట్లు భూసార కార్డులు ఇచ్చారని సత్యకుమార్ గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కి 74 లక్షల 55 వేల 24 భూసార కార్డులు, సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వటం జరిగిందని కొత్తగా ముఖ్యమంత్రి భూసార కార్డులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం విడ్డూరంగా ఉందని ఆయన తెలియజేశారు.

భూసార పరీక్షలు చేసి భూమికి ఏ ఎరువులు వాడాలి ఏ పంటలు వేయాలి అనేది అందులో ఉంటుందని దాంతో పండించే వరి పంటకు 16% నుంచి 20% ఎరువుల ఖర్చులు తగ్గుతాయని సత్యకుమార్ తెలిపారు. 25 శాతం నుంచి 30% దిగుబడి పెరుగుతుందని ఆయన వివరించారు. రైతులకు పంట బీమా ప్రీమియం కట్టకపోవడం వల్ల పంట భీమా రైతులకు రాలేదని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ప్రకారం రైతులకు రెండు నెలలకు ఒకసారి 2000 చొప్పున రైతులు అకౌంట్లకు చేరుతున్నాయని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల బీమా కింద రైతు భరోసాల కేంద్రాలు ఏర్పాట్లు 12,500 ఇస్తానని వాగ్దానాలు పలికారని 7వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు.

వరద నష్టం అంచనాలు వేయించాలి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరదల కారణంగా నష్టపోయిన రైతులను, కుటుంబాలను ఆదుకోవాలని వరదల వల్ల పంట నష్టం వాటిల్లిందని ఇల్లు కొట్టుకుపోయాయని పంట నష్టాన్ని అంచనా వేయించి అలాగే ఆస్తి నష్టాన్ని కూడా అంచనా జరిపించాలని అంచనాలు వేసే కార్యక్రమంలో మా సహాయ సహకారాలు ఉంటాయని సత్యకుమార్ తెలిపారు. అవసరమనుకుంటే కోనసీమ జిల్లాకు కేంద్రాన్ని సహాయనిధి కోరడానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో కమిటీ ద్వారా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

Related posts

మాజీ మంత్రి జూపల్లి ఆరోగ్యం కోసం కొల్లాపూర్ లో పూజలు

Satyam NEWS

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

Sub Editor 2

Leave a Comment