40.2 C
Hyderabad
April 29, 2024 17: 01 PM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం పెంచాలి

#outsoursingworkers

ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు నెలకు 21,000 వేల రూపాయలుగా వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం  ప్రభుత్వ వైద్యశాల ఔట్ సోర్సింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్పిటల్ కార్మికులతో  కాంట్రాక్టర్లు వెట్టి చాకిరీ చేయించుకుంటారని,నెల నెలా జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని అన్నారు. వచ్చే 6 వేల వేతనంతో జీవితాలు గడవడం కష్టమైందని,ప్రభుత్వ జివో నెంబర్ 16 వెంటనే విడుదల చేసి,15,500 రూపాయలు వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్టర్ల వేధింపులు,అధికారుల వేధింపులు ఆపాలని,లేకుంటే ఆందోళన చేస్తామని అన్నారు.

హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎఐటియుసి కి రాజీనామా చేసి సిఐటియు లో చేరిక హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు చెందిన శానిటేషన్ పేషంట్ కేర్,సెక్యూరిటీ గార్డ్స్,మంగళవారం ఎఐటియుసి కి రాజీనామా చేసి సిఐటియు లో చేరారు.

సిఐటియు జిల్లా అధ్యక్షుడు నెమ్మాది మాట్లాడుతూ సిఐటియు కార్మికుల హక్కుల కొరకు రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ తప్ప ప్రభుత్వ ఉద్యోగులు లేవని,తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేస్తున్నారని, కరోనా కష్ట సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజల ప్రాణాలు కాపాడారని, అలాంటి కార్మికులకు రక్షణ పరికారాలు, రెండు జతల యూనిఫామ్,బ్లౌజులు, బూట్లు ఇవ్వాలని,ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని లేకుంటే భవిష్యత్ లో పోరాటాలు చేస్తామని అన్నారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్,మామిడి సుందరయ్య,శ్రీను,వెంకన్న, జ్యోతి,రాములమ్మ,నాగయ్య,చంద్రమౌళి, పద్మ,సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్ సత్యం న్యూస్

Related posts

ఖైరతాబాద్ ప్రాంతాన్ని క్వారంటైన్ చేస్తున్న అధికారులు

Satyam NEWS

ఆల్ ఇండియా డొమెస్టిక్ క్రికెటర్ రవితేజ కు ఆర్థిక సహాయం

Satyam NEWS

నిర్మల్ బిజెపి అధ్యక్షురాలికి పాకిస్థాన్ నుండి బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment