25.7 C
Hyderabad
May 19, 2024 04: 37 AM
Slider ఆధ్యాత్మికం

విజయనగరం ధ్యానమందిరం లో స్వామీజీ మహా సమాధి ఆరాధనోత్సం

#Swamyji

అపర వాల్మీకి, సిధ్ధ సమాజ వ్యవస్థాపకులు ,పరమపూజనీయ శ్రీశ్రీశ్రీ స్వామి శివానంద పరమహంసల ప్రియ శిష్యులు, మౌన స్వామి శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి మహా సమాధి ఆరాధనోత్సం..అన్ని చోట్ల జరుగుతోంది.

ఈ సందర్భంలో  విజయనగరంలో స్వామి శ్రీరామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి రిటైర్డ్ డీఎంఅండ్ హెచ్ ఓ డా.వీ.వెంకటేశ్వరరావు శ్రీ గురూజీ చే నెలకొల్పబడిన ధ్యానమందిరం లో కూడా స్వామీజీ మహా సమాధి ఆరాధనోత్సం సందర్భంగా 12 గంటల పాటు నిర్విరామంగా ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5.30 నుంచీ మరుసటి ఉదయం 6 గంటల వరకూ అఖండజపం జరిగింది.

1993 మార్చి 9 వ తేదీన శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద పరమ హంసల వారు సమాధి పొందారు. ఆ రోజే కామన్నవలస అశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ గురూజీ అఖండజపం మొదలు పెట్టారు. అదే ఏడాది లో స్వామీజీ సమాధి పొందిన తదుపరి మంగళవారం 16 వ తేదీ నాడు విజయనగరం లో ఇద్దరే ఇద్దరు శిష్యులైన గోపీ ,రాములతో అఖండజపం ప్రారంభమైంది.

అప్పటి నుంచీ.. నిర్విరామంగా సరిగ్గా ఇవాళ్టి కి 28 ఏళ్లు పూర్తయ్యింది. ఈ తరుణంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ ఆదేశాల తో విజయనగరం ధ్యానమందిరంలో అఖండ ప్రాణాయామ జపం ప్రారంభించారు…స్థానిక శిష్య బృందం.

ఈ జపానికి.. ప్రముఖ వైద్యులు, మిమ్స్ లో పని చేస్తున్న డా.సుబ్రహ్మణ్యందంపతులు, ఆర్మీ ఉద్యోగి భాస్కర్ దంపతులు, ప్రభుత్వ ఉద్యోగి రామకృష్ణ దంపతులతో పాటు 104  ఉద్యోగిని వరలక్ష్మి, శర్మ ,రవి ,మంగారావు, తదితర శిష్యులు హాజరైయ్యారు.

Related posts

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS

నిన్న వెంకటగిరి… రేపు ప్రత్తిపాడు… మరో 38

Bhavani

Leave a Comment