38.2 C
Hyderabad
May 1, 2024 19: 50 PM
Slider గుంటూరు

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

#Corona Awareness

కోవిడ్ వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలతో కూడిన ప్రచారం రథం రూపొందించారు. దాన్ని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిన ఉండాలని, ఈ అవగాహన కల్పించేందుకు రోడ్డు సేఫ్టీ యన్. జి. ఓ సంస్థ ప్రతినిధి బి. కె. దుర్గ పద్మజ స్వచ్ఛందంగా ఆడియో తో కూడిన ప్రచార వాహనం తయారు చేశారని అన్నారు.

ఆడియో లో రోడ్డు సేఫ్టీ యన్. జి. ఓ వారి ద్వారా పబ్లిక్ అవర్నెస్ ఆన్ కోవిడ్ 19 నిర్వహిస్తారు. రోడ్డు సేఫ్టీ ఎన్జీవో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ లో నమోదు అయిన స్వచ్ఛంద సేవా సంస్థ అని బి. కె. దుర్గ పద్మజ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. అర్. ఓ ఎన్జీవో కన్వీనర్ బి. కె. దుర్గ పద్మజ , సభ్యులు సాంబశివరావు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి మునిసిపాలిటిలో అవినీతి ఆధారాలతో నిరూపిస్తా

Satyam NEWS

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

ఎక్స్ క్లూజీవ్: సీనియర్లకు స్థానచలనం తప్పదా?

Satyam NEWS

Leave a Comment