32.7 C
Hyderabad
April 27, 2024 00: 53 AM
Slider కృష్ణ

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

#BJP Leader

తెలంగాణ నుండి ఆంద్రప్రదేశ్ కి అక్రమంగా మద్యం తరలిస్తున్న అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన గుడివాక అంజిబాబు ని గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. గుడివాక అంజిబాబు 2019 ఎన్నికలలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేశారు.

అంజిబాబు వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈ బి అదనపు ఎస్పీ తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు తరలిస్తుండగా గుంటూరు వద్ద ఏఈఎస్​ చంద్రశేఖర్​ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు.

వీరి వద్ద నుంచి 40 కేసుల(1920 మద్యం సీసాల)ను, 3 కారులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఎస్​ఈబీ అదనపు ఎస్పీ ఆరిఫ్​ హాజిఫ్​ తెలిపారు. నిందితులు గుడివాక రామాంజనేయులు, మచ్చా సురేశ్​, కె. నరేశ్​, గంటా హరీశ్​లుగా పోలీసులు గుర్తించారు.

వీరిలో భాజపా నేత గుడివాక రామాంజనేయులు అలియాస్​ అంజిబాబు ఎ-1 నిందితుడని అధికారి చెప్పారు. ఈయన 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

Related posts

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పేదరైతు రెండు ఎద్దులు బలి

Satyam NEWS

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన పల్నాడు జిల్లా ఎస్పీ

Bhavani

Leave a Comment