25.7 C
Hyderabad
May 19, 2024 05: 50 AM
Slider నల్గొండ

అర్హులైన ముస్లిం సోదరులకు షాపును కేటాయించాలి

#shops

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీదులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్స్పెక్టర్ మహమూద్ ముస్లిం సోదరులు అందజేశారు.

హుజూర్ నగర్ పట్టణం లోని స్థానిక ఉస్మానియా మసీద్ వక్స్ నూతన షాపింగ్ కాంప్లెక్స్ మసీదులో షాప్ నెంబర్ 5 లక్షలాది రూపాయలకు అమ్మకాలు, కొనుగోలు జరిగినట్టు వదంతులు వస్తున్నాయని రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఎండి అజీజ్ పాషా,షేక్ మన్సూర్ అలీ జిల్లా వక్స్బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ కి వినతి పత్రం ద్వారా పలు ఫిర్యాదులు చేశారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా, మన్సూర్ అలి మాట్లాడుతూ ఉస్మానియా మసీద్ వర్క్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న షాప్ నెంబర్ 5 ప్రస్తుతం ఉన్న కిరాయిదారులు ఒకవేళ నడపలేని పరిస్థితిలో ఉంటే వక్స్ బోర్డ్ వారు  స్వాధీనం చేసుకొని బోర్డు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన పేద ముస్లిం సోదరులకు అట్టి దుకాణాన్ని కేటాయించాలని,ఇష్టాను రీతిలో వ్యవహరిస్తే ముస్లిం సోదరులందరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వినతిపత్రం ద్వారా తెలిపినట్లు తెలియజేశారు.

స్థానిక ఉస్మానియా మసీదులో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని,మసీదులలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తక్షణమే చెల్లించాలని, రంజాన్ నెల బోనస్ ఇవ్వాలని,త్రీఫేస్ కరెంటు ఏర్పాటు చేయాలని,మంచినీటి ఫిల్టర్ కు మరమ్మత్తులు చేయించాలని, మసీదులో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అజీజ్ పాషా,మన్సూర్ అలి డిమాండ్ చేశారు.అమ్మకాలు కొనుగోలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చినట్లు అజీజ్ పాషా తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ సాదిక్,ఎస్.కె. మజీద్,ఎస్.కె.అక్బర్ బాయ్,ఎస్.కే.జానీ భాష,ఇబ్రహీం,రసూల్,హిజ్రి మేస్త్రి, సలావుద్దీన్,ఎండి బాబా,సైదా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

కరోనాపై పోరాడుతున్న జర్నలిస్టులకు సన్మానం

Satyam NEWS

దివాలాతీసిన ఏపి విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment