32.2 C
Hyderabad
May 19, 2024 16: 44 PM
Slider మహబూబ్ నగర్

ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో తాగునీరు లేక సంపు నీరు తాగుతున్న విద్యార్థులు

#students

ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో తాగునీరు లేక సంపు నీరు తాగుతున్నారు అక్కడి విద్యార్థులు. అధికారులు మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో ఎస్ఎఫ్ఐ తన నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మాట్లాడుతూ కొల్లాపూర్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో తాగునీరు లేక సంపు నీరు తాగుతున్నారని తెలిపారు. సంపు నీరు తాగి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 

హాస్టల్ లో ఉన్న సంపు సక్రమంగా పరిశుభ్రం చేయడం లేదని అన్నారు. సంపులో మొత్తం కుళ్ళు కాగితాలు చెత్తాచెదారం పడిన అదే నీరు తాగుతున్నారని అన్నారు. కాబట్టి అధికారులు స్పందించి విద్యార్థులకు మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు రాజేశ్వరి, సునీత, అమృత, శైలజ, శృతి, నందిని, నిర్మల, మనిషా, శ్రీజ, రాధా, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Bhavani

సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్

Satyam NEWS

చైత్ర హంతకుడ్ని ఎన్ కౌంటర్ చేసి చంపేస్తాం: మంత్రి మల్లారెడ్డి

Satyam NEWS

Leave a Comment