27.7 C
Hyderabad
May 7, 2024 08: 36 AM
Slider కడప

వైసీపీ లీడర్ కూతురు కోసం పేద మెరిట్ ముస్లిం విద్యార్ధిని బలి

#kadapa

మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా ఆధ్వర్యంలో కడప జిల్లా  రాయచోటి పట్టణంలో ముస్లింలు నిరసనలు తెలియచేసారు. అనంతరం విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన విద్యార్థిని మిస్భా ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైసీపీ  ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు అని ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. మిస్బా పలమనేరు పట్టణంలో బ్రహ్మర్షి హైస్కూలులో పదో తరగతి చదువుతోంది, క్లాసులో టాప్‌ స్టూడెంట్‌ గా ఉంది అని అన్నారు. అదే క్లాసులో చదువుతున్న స్థానిక వైసీపీ నేత సునీల్‌ కుమార్తె పూజిత చదువులో మిస్బాతో పోటీపడేది అని అన్నారు.

క్లాసులో వైసీపీ నేత కుమార్తె పూజితా టాపర్‌గా ఉండాలి అని మిస్భా ను  స్కూలుకు రావొద్దు’ అంటూ వైసీపీ నేత సునీల్, స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్,  మిస్బాను తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి,   బెదిరించారు అని అన్నారు. వైసీపీ నేత సునీల్‌ కుమార్తె పూజిత చదువుకునే బడిలో తమపిల్లలే టాపర్‌గా ఉండాలి అంటూ చక్కగా చదువుకునే పేదింటి ముస్లిం బాలిక మిస్భాను వెంటాడి వేధించి ఆత్మహత్య కు ప్రేరేపించిన వైసీపి నేత సునీల్, మరియు ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ రమేష్ ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థిని మిస్భా ను వైసీపీ నేత సునీల్, స్కూల్ ప్రిన్సిపాల్ తనను వేధించారు అని తన బాధను వివరిస్తూ లేఖ రాసి మంగళవారం ప్రాణాలు తీసుకుంది అంటే రాష్ట్రంలో ముస్లింలపై ఈ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ్యత లేదు అని తేటతెల్లం అయింది అని అన్నారు.

పేదలుగా పుట్టడమే ముస్లిం పిల్లలు చేసుకున్న పాపమా?’ అని ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. బాగా చదివే విద్యార్థిని మిస్భా మార్కులు వైసీపీ నేత సునీల్ కుమార్తె కంటే ఎక్కువగా రావడం మిస్భా చేసిన పాపమా అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని తో వాళ్లు వైసీపీవాళ్లు మీరు సోడా అమ్ముకునే కూలోళ్లు ఎక్కువ మాట్లాడితే టీసీ ఇచ్చేస్తా, జిల్లాలో ఎక్కడా చదువుకోకుండా చేస్తా మీ అమ్మానాయనా అందరూ ఉరేసుకునేట్టుగా చేస్తా’ అంటూ ప్రిన్సిపాల్‌ బెదిరించారు అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో పేదల పిల్లలు విద్యకు అనర్హులా అని ప్రభుత్వాన్ని విమర్శించారు.

మిస్బా తల్లిదండ్రులు నజీర్‌ అహ్మద్‌, నసీమా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అని అన్నారు. అలాంటి ఇంటిలో ఒక చదువుల తల్లి పుట్టి ఆ ఇంటికి పేరు ప్రతిష్టలు తెస్తుంటే అది చూసి ఊర్వలేక ఆ పేదింటి బిడ్డను బలితీసుకున్నారు అని తన మనో వేదనను వ్యక్తపరుస్తూ,  ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రజలు గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఇనాం ఉల్లా, రాజంపేట పార్లమెంటరీ మైనార్టీ సెల్ కార్యదర్శి వతన్ నిసార్, పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలి, సోనిరాజ్ ఖలీమ్, అబుజర్, రాజంపేట పార్లమెంటరీ రైతు ఉపాధ్యక్షుడు చిన్న కృష్ణా రెడ్డి, రాజారెడ్డి, రాము, తదితరులు పాల్గొని పెద్దఎత్తున నిరసన తెలియచేసారు.

Related posts

36 వ సారి రక్తదానం చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు

Bhavani

ఏసీబీ వలలో చిక్కిన వ్యవసాయ అధికారి

Satyam NEWS

వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తా

Murali Krishna

Leave a Comment