32.2 C
Hyderabad
May 16, 2024 11: 23 AM
Slider ప్రత్యేకం

వడ్లు కొనకుంటే ఉద్యమం తప్పదు: టిఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత సమావేశం

#trsparty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ముందుగా పార్టీ సర్వసభ్య సమావేశానికి,వడ్ల కొనుగోలు సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పీటీసీ,హుజుర్ నగర్,సమావేశానికి హాజరైన సమస్త శ్రేణులకి,అనుబంధ నాయకులకు,కార్యకర్తలకు మహిళ నాయకులకు పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలిపారు.

జై తెలంగాణ అనే ఒక ఒక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని,1969 నుండి ఎన్నో సంఘటనలు జరిగి ఎన్నో పార్టీలు,ప్రభుత్వాలు ఎన్నో దశాబ్దాలు యావత్ తెలంగాణను మనలను ఎదగనీయకుండా తొక్కేశారని, అటువంటి పరిస్థితుల నుండి తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి,ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కెసిఆర్ అని అన్నారు.నేడు కేంద్ర ప్రభుత్వం కెసిఆర్ ను చూసి భయపడుతుందని, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టే ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమేనని,  తెలంగాణ సమాజాన్ని దెబ్బకొట్టాలని ధాన్యం కొనకుండా కుట్ర పన్నుతుందని,కేంద్రం ఏనాడు ప్రజలను పట్టించుకున్నది లేదని,తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని,దేశం మొత్తంలో ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న  ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు.

తెలంగాణ వచ్చిన మొదట్లో కొంత మంది తట్టుకోలేక ఎన్నో రకాలుగా వెక్కిరించి,సెటరీటికల్ వీడియోలు పెట్టారని,కెసిఆర్ అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ ఈ రోజు యావత్ దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా తయారు చేశారని,అదే కెసిఆర్ పనితనమని అన్నారు. తాను ఏనాడు ఎమ్మెల్యే అనుకోను,అలా ఫీల్ కాను,ఎల్లప్పుడూ ప్రజల సేవకుడినే అనుకుంటానని,అలాగే ఉంటానని, ప్రజాసేవ కొరకే రాజకీయాల్లోకి వచ్చానని,మీ అందరి ఆశీర్వాదంతో హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రెయిబావళ్ళు అలుపెరగకుండా పని చేస్తూ అభివృద్ధిని పరుగెత్తిస్తున్నానని, టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏది చెప్పిందో వాటన్నింటిని చేసి చూపిస్తున్నామని,అభివృద్ధిని జీర్ణించుకోలేక కొందరు అడ్డు పడుతున్నారని,కేసులు వేస్తున్నారని అన్నారు.ట్రైబల్ రిజర్వేషన్స్ కి అందరి ముందే సంతకాలు పెట్టి పంపిస్తే కేంద్రం అబద్దాలు ఆడుతుందని అన్నారు.

మన అభివృద్ధి పనుల మీద కేసులు వేస్తే ఈ మధ్యనే న్యాయస్థానాలు కూడా వారికి బుద్ధి చెప్పాయని,సోమవారం నుండి పనులు ప్రారంభమౌతాయని అన్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచేసి ఎవ్వరిని విడిచి పెట్టకుండా ఉసురు పోసుకుంటున్నారని,2014 నుండి ఇప్పటి వరకు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని,అయిన కెసిఆర్  ప్రాజెక్టులు కట్టి సంపదని సృష్టిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం పంజాబ్ లో 100 కు 100 శాతం వరి, గోధుమలు కొటుందని,కానీ తెలంగాణలో ధాన్యం కొనడం లేదని అన్నారు.

ఎఫ్ సి ఐ లు ఇంతకు ముందు కరువులు వస్తే తట్టుకునేలా  బఫేర్ స్టాక్ లు మెంటైన్ చెయ్యాలి, కనుక జాగ్రత్తగా ఉంటూ రైతులను,ఎఫ్ సి ఐ  ని బలోపేతం చేయాలని కెసిఆర్  చెబుతూనే ఉన్నారని అన్నారు.రాష్ట్రలకు పర్మిషన్లు ఉండవు,కేంద్రం కొనదు, రాష్ట్రాలను కొననివ్వరు ఇలా తెలంగాణ రైతాంగాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రని  కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

ఇక నియోజకవర్గంలో కొంత మంది బిజెపి నాయకులు రైతులకు చేసింది ఏమి లేదని,కానీ రైతులను రెచ్చగొడుతూ గడ్డిని కాలుస్తూ రెచ్చగొడుతూవుంటారని, వారి నుండి రైతులు,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.కేంద్రం వడ్లు కొనాలి అని ప్రతి ఇంటి మీద నల్ల జెండాలు పెట్టాలని,సర్పంచ్ లు గ్రామ పంచాయతీలలో తీర్మానం చేయాలని, మండలాల, పిఎసిఎస్,మార్కెట్ కమిటీల నుండి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపి వడ్లు కొనాలి అని మనం ఒత్తిడి తేవాలని అని తెలియజేసారు.

బిజెపి నాయకులు ఏనాడు ప్రజల గురించి,రైతుల గురించి ఆలోచించరు.కేంద్రం వడ్లు కొనకుంటే మన తడాఖా చూపిస్తామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గరి నుండి విభజన హామీలు ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదని అన్నారు.కెసిఆర్ తనతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే ప్రజలు ఆర్ధికంగా బలోపేతం కావాలి,చిన్న చిన్న దేశాల మాదిరిగా అభివృద్ధి చెందాలని అన్నారని గుర్తు చేశారు.ఈ హుజుర్ నగర్ పోరాటాల పూరిటి గడ్డ.కెసిఆర్ నుండి ఎప్పుడు పిలువు వస్తే అప్పుడు వెంటనే రంగంలోకి దూకాడానికి అందరం సిద్ధంగా ఉండాలని,టిఆర్ఎస్

సర్పంచ్ లు 80 శాతం అద్భుతంగా పని చేస్తున్నారని,టిఆర్ఎస్ సర్పంచ్ లకు ఇతర పార్టీ గ్రామాలకు తేడాలు కచ్చితంగా కనిపిస్తుందని,టిఆర్ఎస్ నాయకులు గ్రామలలో అన్ని శ్రేణుల నాయకులను కలుపు కొని టీం వర్క్ చేయాలని,పార్టీని అద్భుతంగా బలోపేతం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు.రాజకీయాలు అంటే సేవ చేసే అదృష్టమని,ఇది అందరికీ రాదు ప్రతి దానిని డబ్బుతో ముడి పెట్టలేము మన హయంలో మనము చేసిన అభివృద్ధి తరతరాలుగా గుర్తు పెట్టుకుంటారని అదే చరిత్ర అవుతుందని అన్నారు.

సిఎం రిలీఫ్ ఫండ్ గతంలో 5 ఏళ్లకు 5 కూడా ఇవ్వలేదని,కానీ మనం ప్రతి 6 నెలలకు సుమారు 3 కోట్ల రూపాయలు ఇస్తున్నామని,కూలవృత్తుల వారందరికి ఏదో ఒకటి చేయాలనే తపన కెసిఆర్ లో ఉందని,వారిని అభివృద్ధి చేయాలి అలా ఎమ్మెల్యే లు  ఆలోచించాలని  అంటుంటారని,కనుక మన పార్టీ లోని అందరూ కూడా ఇలాగే గుణాత్మకంగా ఆలోచన చెయ్యాలని,పార్టీ లోని అందరూ నాయకుల నుండి కార్యకర్తల వరకు ప్రజలలోకి చొచ్చుకొని పోవాలి,సేవ చేయాలి,మన పనులు  పార్టీకి,ఊరికి ఉపయోగపడాలి,మళ్ళీ మనమే సేవ చేసే విధంగా ఉండాలని, పార్టీకి,ప్రజలకు సేవ చేసేస్తేనే మనం తిరిగి అధికారంలో ఉంటాము.కనుక మనసులో ఎలాంటి భేషేజలు రాకుండా పని చెయ్యాలని,పదవులు రావాలన్నా, నిలబెట్టుకోవాలన్నా ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చెయ్యాలని,పార్టీకి అనుకూలంగా క్రియాశీలకంగా ఉండాలని కోరారు.

ఈ రోజు మహిళలు కూడా పార్టీ పరంగా ముందుకు వస్తున్నారని,వారిని ప్రోత్సహించి నాయకులుగా తీర్చి దిద్దాలని,త్వరలోనే 1000 మంది మహిళ నాయకులతో సమావేశం పెట్టుకోబోతున్నామని,30 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది

26,27,28 తేదీలలో ఉచిత కోచింగ్ పుస్తకాలు ఇస్తున్నామని,యూత్ లీడర్స్ అందరూ అందుబాటులో ఉండాలని కోరారు.పార్టీని ఒక కుటుంబంగా చూసుకోవాలి,మనమంతా పార్టీ వల్లనే కలిసి వుంటున్నామని,కనుక బంధువుల కన్నా,చుట్టాల కన్నా,పార్టీ సభ్యులమే గొప్పగా వుంటున్నామని చుట్టాల కంటే ప్రజలే గొప్పని,పార్టీ కోసం ప్రతి ఒకరికొకరు అందుబాటులో ఉండి కలుపు కోవాలని,కలిసి పనిచేస్తూ పార్టీ కోసం ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నీట్, జేఈఈ సాధన కు “కోటా” డిస్టెన్స్ లెర్నింగ్

Satyam NEWS

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

Satyam NEWS

Viral video  : గల్వాన్ లోయలో భారత సైనికుల క్రికెట్

Satyam NEWS

Leave a Comment